విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Jun 24 , 2025 | 10:52 PM
విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మురుగుమ్మి జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బ్యాగ్‌లు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
మురుగుమ్మి పాఠశాల సందర్శన
విద్యార్థులకు బ్యాగ్‌లు, పాఠ్యపుస్తకాలు పంపిణీ
పీసీపల్లి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మురుగుమ్మి జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బ్యాగ్‌లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి అవసరమైన మౌలికవసతుల కల్పనకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషిచేస్తున్నారన్నారు. పేద విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే లోకేష్ ఆశయమన్నారు. అందుకోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేయడంలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి అమ్మఒడి వేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. అఽధికారంలోకి రాగానే ఒక్కరికే నగదును జమచేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి తల్లుల ఖాతాలో నగదు జమచేసిందని చెప్పారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు జగన్ బొమ్మ, పార్టీ గుర్తులతో కూడిన నాసిరకమైన యూనిఫాం, బ్యాగులను ఇచ్చిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో కూటమి ప్రభుత్వం పార్టీ గుర్తులు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మతో నాణ్యమైన బ్యాగ్‌లు, యూనిఫాంలను ఉచితంగా అందజేసిందని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులతో పాటు విద్య నేర్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.