పేదల ఆరోగ్యానికి ప్రభుత్వ భరోసా
ABN , Publish Date - Aug 10 , 2025 | 10:27 PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తూ వారికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 103 మంది లబ్ధిదారులకు రూ.70,42,365 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అశోక్‌రెడ్డి పంపిణీ చేశారు.
నియోజకవర్గంలోని 103 మందికి సీఎం రిలీఫ్ ఫండ్
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తూ వారికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 103 మంది లబ్ధిదారులకు రూ.70,42,365 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అశోక్‌రెడ్డి పంపిణీ చేశారు. ఓ పక్క పేదలకు ఖరీదైన వైద్యం అందిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని కొనియాడారు. సీఎం సహాయనిధి ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక సాయం అందడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. వైద్య రంగంలో అందుబాటులో ఉన్న సేవలు అనేక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. గత పాలకులు పేదల సంక్షేమాన్ని మరిచి అరాచక పాలన సాగించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా కూడా పేదలకు సంక్షేమం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాచర్ల మండలానికి చెందిన ఐదుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ
ఇద్దరు దివ్యాంగులకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ట్రైసైకిళ్లను అందచేశారు. ఆదివారం ఆయన కార్యాలయంలో కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన దివ్యాంగులు షేక్ దస్తగిరి, మామిళ్ల కోటయ్య ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. భవిష్యత్‌లో మరింత మంది దివ్యాంగులకు సహాయం అందించే దిశగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రామచంద్రరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు గోపాల్‌రెడ్డి ఉన్నారు.