మహిళలకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:52 AM
ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు అద్భుతాలు చేస్తారని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.
మార్టూరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు అద్భుతాలు చేస్తారని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో స్త్రీశక్తి విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మహిళల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. సూపర్ సిక్స్ పథకంలో హామీని నెరవేర్చేందుకు నెలకు ప్రభుత్వానికి రూ.162 కోట్ల భారం పడుతున్నప్పటికీ ఈ నెల 15 నుంచి మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ప్రారంభించిందన్నారు. అంతేగాకుండా తల్లికి వందనం అంటూ బిడ్డల భవిష్యత్తు బంగారం కావాలనే ఉద్దేశ్యంతో వారి ఖాతాలో డబ్బులు జమచేసిందన్నారు. అదేవిధంగా దీపం పధకం ద్వారా ప్రతి కుటుంబానికి 3 ఎల్పీజీ సిలిండర్లను అందచేసిన ప్రభుత్వమే కూటమి ప్రభుత్వ మన్నారు. తరువాత మహిళలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 77 స్వయం సహాయక సంఘాలకు రూ.11. 25కోట్ల విలువైన చెక్కును గ్రూపు మహిళలకు ఎమ్మెల్యే ఏలూరి అందచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుమహిళ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జరుగుల సంధ్య, జయమ్మ, బత్తుల కృష్ణవేణి, ఉప్పుటూరు రమాదేవి, కర్రీ నాగేంద్రమ్మ, శారద, వనజ, పద్మావతి,రావిపాటి సంఽధ్య,జంపని రాద, పలువురు మహిళలు భారీగా ఈ సదస్సుకు తరలివచ్చారు.
వారంలో పొగాకు రైతుల ఖాతాలలో నగదు జమ
పొగాకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే రూ.55 కోట్ల ను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. రైతులఖాతాలలో వారం రోజులలో ఈ డబ్బులు జమ చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబ శి వరావు అన్నారు. ఆయన శనివారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో మార్కెట్ కమిటీ, పీఏసీఎస్,డీసీలతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా పొగాకు కొనుగోలు చేపట్టామని, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందన్నారు. 2029 లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవిధంగా రైతులకు వెన్నుదన్నుగా నిలబడి పనిచేయాలన్నారు. అంతేగాకుండా రూ.100 కోట్లతో గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మాణం పనులు చేపడుతున్నామన్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన సొసైటీ చైర్మన్లు, సభ్యులను, మార్కెట్ కమిటి అధ్యక్షులను శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ గుంజి వెంకట్రావు, సొసైటీ చైర్మన్లు కంభంపాటి హనుమంతరావు, తాటి నాగార్జున, గొట్టిపాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఎమ్మ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 105 మంది లబ్దిదారులకు రూ.61,12,746లను చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అందచేశారు.
పేదలు, కూలీల కోసమే అన్న క్యాంటీన్ ఏర్పాటు
మార్టూరు: రాష్ట్రంలో పేదలు, కూలీలు, కార్మికులు ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు అన్నారు. శనివారం ఉదయం మార్టూరులో నాగరాజుపల్లి కూడలి వద్ద రూ.61 లక్షలు నిధులతో మంజూరైన అన్న క్యాంటీన్ భవననిర్మాణానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మార్టూరు పట్టణంలో అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీలైనంత త్వరగా క్యాంటిన్‌ను పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు మహాలక్ష్మమ్మ అమ్మ వారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం మార్టూరు గ్రామంలో తూర్పుబజారున,పడమర బజారున ఏర్పాటుచేసిన వినాయకుని మండపాల వద్ద వినాయకుని విగ్రహాన్ని దర్శించుకొని, స్వామి వారిఆశీస్సులను అందుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తన్నీరు శ్రీనివాసరావు, పార్టీనాయకులు షేక్ రజాక్, కామినేని జనార్దన్, కమ్మ శివనాగేశ్వరరావు, తేలప్రోలు సాంబశివరావు, తాటి నాగేశ్వరరావు, పోపూరి శ్రీనివాసరావు, కాకోలు వెంకటేశ్వర్లు, గొట్టిపాటి వెంకట్రావు, సకల ఆంజనేయులు, పోలూరి సింగయ్య, మిన్నెకంటి రవికుమార్, జంపని శ్రీను తదితరులు పాల్గొన్నారు.