Share News

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:59 PM

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ఒంగోలులో టీ తాగుతూ సమావేశమైన ఉద్యోగులు

జిల్లా వ్యాప్తంగా రండి టీతాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని యూనిట్ల సంఘ బాధ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రామనగర్‌లోని ఫుడ్‌ సేఫ్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఉద్యోగులు చర్చించారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డీఏలను ఇవ్వాలని, పీఆర్‌సీ కమిటీని వెంటనే నియమించి ఐఆర్‌(మధ్యంతర భృతి) ప్రకటించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, వివిధ వర్గాల నుంచి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వరకుమార్‌, సంఘం నాయకులు వెంకటేశ్వరరెడ్డి, గోపికృష్ణ, రంగారెడ్డి, ఎం. శ్రీనివాసరావు, ఏసురత్నం, సునీల్‌, జవహర్‌వలి, సురే్‌షబాబు, శ్రీదేవవి, చంద్రశేఖర్‌, శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు డాక్టర్‌ మానస, వనజ,సుమతి, గౌరీ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 11:59 PM