గూగుల్ డేటా సెంటర్ దేశానికే తలమానికం
ABN , Publish Date - Oct 15 , 2025 | 10:09 PM
ప్రజా ప్రభుత్వ పాలనలో యువతకు ఉపాధి లక్ష్యంగా అనేక రంగాల్లో మార్పులు జరుగుతున్నాయని అందులో భాగంగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ దేశానికే తలమానికంగా ఉండబోతోందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
త్రిపురాంతకం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వ పాలనలో యువతకు ఉపాధి లక్ష్యంగా అనేక రంగాల్లో మార్పులు జరుగుతున్నాయని అందులో భాగంగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ దేశానికే తలమానికంగా ఉండబోతోందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషితో విశాఖ నగరం డేటా హబ్ సెంటరుగా ఎదుగుతోందని ఒక ప్రకటనలో తెలిపారు. గత పాలనలో వైసీపీ నాయకులు ఐటీ కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వని కారణంగా కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని అన్నారు. కానీ కేవలం 16 నెలల్లోనే విశాఖకు రూ.6.50లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో విశాఖ కేంద్రంగా యువతకు భారీగా ఐటి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఎరిక్షన్‌బాబు తెలిపారు.