Share News

వివిధ రూపాల్లో పూజలందుకున్న అమ్మవార్లు

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:00 PM

దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని పట్టణంలోని వివిధ ఆలయాల్లో అమ్మవార్లు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు శ్రీపతి అప్పనాచార్యులు రాజ్యలక్ష్మి అమ్మవారి మూలవిరాట్‌ ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. రాజ్యలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మిగా దర్శనమిచ్చారు.

వివిధ రూపాల్లో పూజలందుకున్న అమ్మవార్లు
మార్కాపురంలో బ్రహ్మచారిణిగా, గిద్దలూరులో పార్వతీదేవిగా

మార్కాపురం వన్‌టౌన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని పట్టణంలోని వివిధ ఆలయాల్లో అమ్మవార్లు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు శ్రీపతి అప్పనాచార్యులు రాజ్యలక్ష్మి అమ్మవారి మూలవిరాట్‌ ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. రాజ్యలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఈవో శ్రీనివాసరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మార్కండేశ్వర స్వామి ఆలయంలో జగదాంబ బ్రహ్మచారిణిగా దర్శనమిచ్చారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి సౌకర్యాలు కల్పించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత సావిత్రిగా, ఆమలక లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు.

గిద్దలూరు : వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు పార్వతీ దేవి అలంకరణలో భ క్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు వాడకట్టు రంగసత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూ జా కార్యక్రమాలు నిర్వహించారు. వార్షిక బ్ర హ్మోత్సవాలలో భాగంగా షరాఫ్‌ బజారులోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారు మత్సావతార అలంకారం లో భక్తులకు దర్శనమిచ్చారు.

త్రిపురాంతకం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి శ్రీమత్‌ బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా రెండోరోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారు హం సవాహనంపై దర్శనమిచ్చారు.

కంభం : దసరా ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు మంగళవారం కోట సత్యమాంబ దేవి అమ్మవారు అంబా భవాని దేవి అలంకారంలో, వాసవీ మాత పరమేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. కంభం, అర్ధవీడు, బేస్తవారపేట మండలాల నుం చి భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా దేవాలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

పొదిలి : పార్వతీ సమేత నిర్మ మహేశ్వరస్వామి దేవాలయంలో పార్వతీదేవి అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చా రు. ప్రధాన అర్చకులు మూలంరాజు సు బ్బనరసయ్య గణపతిపూజ, కలశపూజ, అభిషేకం, కుంకుమార్చన, హోమం కార్యక్రమాలు నిర్వహించారు.

పెద్దదోర్నాల : వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, పోలేరమ్మ అమ్మవారి దే వాలయం, సాయి మందిరం, తిమ్మాపురంలోని చౌడేశ్వరిదేవి ఆలయంలో గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

రాచర్ల : పట్టాభి రామాలయంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు సతీష్‌ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకం పూజలు చేశారు.

Updated Date - Sep 23 , 2025 | 11:00 PM