గడప గడపకు వెళ్లి..
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:18 AM
జిల్లావ్యాప్తంగా శనివారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగింది. పేదల సేవలో ప్రభుత్వం పేరుతో ప్రతినెలా 1న పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. స్థానికంగా మంత్రి నుంచి సచివాలయ సిబ్బంది వరకు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికార యం త్రాంగం ఇందులో భాగస్వాములు కావాలని, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సామాజిక పింఛన్లు అందజేత
కొద్దిగంటల్లోనే మూడొంతుల మందికి పూర్తి
తూర్పునాయుడుపాలెంలో పాల్గొన్న మంత్రి స్వామి
ఇతరచోట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు
ఒంగోలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా శనివారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగింది. పేదల సేవలో ప్రభుత్వం పేరుతో ప్రతినెలా 1న పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. స్థానికంగా మంత్రి నుంచి సచివాలయ సిబ్బంది వరకు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికార యం త్రాంగం ఇందులో భాగస్వాములు కావాలని, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఉదయం 6.30 గంటల నుంచే సచివాలయ సిబ్బంది తమ పరిధిలో పింఛన్ల పంపిణీని చేపట్టారు. జిల్లాకు ఈనెలకు సంబంధించి 2,83,704 మంది లబ్ధిదారులకు రూ.125.39 కోట్లు మంజూరయ్యాయి. వీటి పంపిణీకి 5,495 మంది సిబ్బందిని కేటాయించారు. ఉదయం పది గంటలకే 75శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 89.82 శాతంతో 2,54,923 మంది లబ్ధిదారులకు రూ.111.89 కోట్ల నగదు పంపిణీ చేశారు. మిగిలిన లబ్ధిదారులకు సాయంత్రం అందజేశారు. కొద్దిమంది అందుబాటులో లేకపోగా వారికి తర్వాత ఇవ్వనున్నారు.
ప్రజాప్రతినిధులంతా హాజరు
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధులంతా ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. మంత్రి డాక్టర్ స్వామి తన స్వగ్రామమైన టంగు టూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని సచివాలయంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగరపరిఽధిలోని త్రోవగుంటలో, సంతనూత లపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ మద్దిపాడు మండలం సీతారాంపురం పంచాయతీ కోస్టాల్ సెంటర్‌లో పాల్గొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నందనమారెళ్లలో, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలోని 8వవార్డు పరిధిలో, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి రాచర్ల మండలం అనుమలవీడులో పింఛన్‌లు పంపిణీ చేశారు. టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు దోర్నాల పట్టణంలో, దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కురిచేడు మండలం దేకనకొండలో పాల్గొన్నారు. పలు ఇతరచోట్ల స్థానిక నేతలు, అధికారులు సమన్వయంతో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.