గిరిజన భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:14 AM
ఒంగోలు నగరంలోని గిరిజన భవనాన్ని ఆ యా సామాజిక వర్గాల సంస్కృతిని ప్రతిబిం బించేలా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరంలోని గిరిజన భవనాన్ని ఆ యా సామాజిక వర్గాల సంస్కృతిని ప్రతిబిం బించేలా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. మంగ ళవారం ఒంగోలులోని గిరిజన భవనాన్ని, పరి సరాలను మొత్తం తిరిగి అందులోని వసతుల ను పరిశీలించారు. ప్రస్తుతం ఆ భవన స్థితిగ తులను గిరిజన సంక్షేమశాఖ అధికారి వరల క్ష్మి కలెక్టర్‌కు వివరించారు. కార్పొరేషన్ నుంచి నీటి కనెక్షన్ రావాల్సి ఉందని, డ్రైనేజీ వ్యవస్థ ను మెరుగుపర్చడంతో పాటు ఆటు భవనం లో ఏసీలు, ఇతర ఫర్నీచర్ ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. భవనం వెనుక వైపున జీజీహెచ్ ప్రాంగణంలో నుంచి ప్రవేశించేలా ఒక గేటును కూడా ఏర్పాటు చేయాల్సి ఉం టుందని, అందుకు సంబంధించి వివరాలను అందజేశారు. ఆయా అంశాలపై కలెక్టర్ అన్సా రియా మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీన ప్ర పంచ ఆదివాసుల దినోత్సవం ఉన్నందున, ఆ లోపు ఈ భవనాన్ని ఆధునీకరించాలని, అవస రమైన మౌళిక సదుపాయాలను పూర్తి స్థా యిలో కల్పించాలని ఆదేశించారు. పూర్తిస్థాయి లో వసతులు సమకూర్చిన తర్వాత ప్రైవేటు కార్యక్రమాలకు కూడా ఈ భవనాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా నిర్వహణకు అవసరమైన ఆ దాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని గిరి జనసంక్షేమశాఖ శాఖ అధికారికి కలెక్టర్ అ న్సారియా సూచించారు. కార్యక్రమంలో డ్వా మా పీడీ జోసెఫ్‌కుమార్, గనులశాఖ డీడీ రాజశేఖర్, నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ భాస్కర్‌బాబు, త హసీల్దార్ మధుసూదన్‌రావు తదితరులు పా ల్గొన్నారు.