Share News

నిరుపయోగంగా జనరేటర్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:34 AM

ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన సేవలు అం దించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది.

నిరుపయోగంగా జనరేటర్‌

మేదరమెట్ల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన సేవలు అం దించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి రాష్ట్రప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయాల్లో లక్షలు వేచ్చించి జనరేటర్‌లను ఏర్పాటు చేసింది. విద్యుత్‌ కోతలతో, సరఫరాలో అంతరాయం వలన ప్రజలకు సేవలు అందుబాటులో ఉండడానికి ఈ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 660 మండలా లల్లో ప్రభుత్వం జనరేటర్లను మంజూరు చేసింది. అయితే గత ఏడు సంవత్సరాలుగా ఈ జనరేటర్లు పనిచేయడం లేదు. వీటి నిర్వహణను ఏదైన ఏజెన్సీకి అప్పగించి, నిధులు కేటాయిస్తే జనరేటర్లు పనిచేసేవి. కనీసం ఏజెన్సీ ద్వారా నిర్వహణ చేపట్టక పోవడంతో లక్షల వెచ్చించి కోనుగోలు చేసిన జనరేటర్లు నిరుప యోగంగా మారాయి. ఇవి ఆరుబయట ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండడంతో శిథిలావస్థకు చేరాయి.

గతంలో ముఖ్యమంత్రు లు, జిల్లా కలెకర్లు, వీడియో కాన్ఫరన్స్‌లు నిర్వహించే సమయం లో విద్యుత్‌ అంతరాయం లేకుండా ఉండడం కోసం, కార్యాలయాలల్లోని కంప్యూటర్లు అన్ని పని చేయాడానికి అవసరమైన సామర్థ్యం కలిగిన జనరేటర్లను ఏర్పాటు చేశారు. జనరేటర్ల మాదిరిగానే వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం ప్రభుత్వం ఇచ్చిన పెద్ద పెద్ద టీవీలు మరమ్మతులతో మూలకు చేరాయి. చాలా మండలాల్లో అధికారులు తమ లాప్‌ట్యాప్‌ లలోనే వీడియో కాన్పురెన్స్‌లకు హజరవు తున్నారు.

జనరేటర్లు నిరుపయోగంగా ఉన్న విషయాన్ని కింది స్థాయి అధికారులు కలెక్టర్‌ దృష్టికి, కలెక్టర్‌ రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళితే సమస్య పరిష్కారం అవుతుంది. మరొకాన్నాళ్లు ఇదేవిధంగా వదిలేస్తే ఈ జనరేటర్‌ను పాత ఇనుము కింద అ మ్ముకోవాల్సి వస్తుంది. ఇదే విఽధంగా మండల కార్యాలయాల్లో టీవీలు కూడా మరమ్మతులకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఇప్పటికైన స్పందించి జనరేటర్లను వినియోగంలోనిక ఏత ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 10 , 2025 | 01:34 AM