Share News

కేజీబీవీలో జీసీడీవో ఆకస్మిక తనిఖీ

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:44 PM

రాచర్ల కెజిబివి (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) పాఠశాలను జీసీడీవో కోగంటి హేమలత మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి బాలికలు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కేజీబీవీలో జీసీడీవో ఆకస్మిక తనిఖీ
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న జీసీడీవో హేమలత

రాచర్ల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : రాచర్ల కెజిబివి (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) పాఠశాలను జీసీడీవో కోగంటి హేమలత మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి బాలికలు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, వంటగది, స్టోర్‌ రూమ్‌ ప్రత్యేకంగా పరిశీలించి వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించారు. పాఠశాలలో అందే మౌలిక వసతుల గురించి బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని, బాలికలకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఇంటర్మీడియట్‌ బాలికలకు జరుగుతున్న పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా ప్రత్కేక కృషి చేయాలని, ప్రత్యేక అధికారి డీ మాలకొండమ్మకు సూచించారు. పాఠశాలలో పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, కలిగించినా లేదా సిబ్బంది సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Updated Date - Nov 18 , 2025 | 11:44 PM