Share News

కోలాహలంగా వినాయక నిమజ్జనాలు

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:41 AM

మున్సిపల్‌ పరిధిలోని 24వ వార్డు తూర్పుకాపు బజారులోని శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి మహోత్సవాలు విశేషంగా నిర్వహించారు.

కోలాహలంగా వినాయక నిమజ్జనాలు

చీరాల, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్‌ పరిధిలోని 24వ వార్డు తూర్పుకాపు బజారులోని శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి మహోత్సవాలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేషుని నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కేరళ నృత్య ప్రదర్శనలు, చిన్నారుల కర్రసాము అందరినీ అలరించింది. భక్తులు ఆధ్యాంతం భారీగా తరలి వచ్చారు. ఊరేగింపు ప్రారంభోత్సవానికి ముందు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రూ. 48 వేలు పలికిన లడ్డూ

బల్లికురవ : వినాయకచవితి పండగ సందర్బంగా గ్రామాలలో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జన వేడు కలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని గుంటుపల్లి దక్షిణం బజారులో ఏర్పాటు చేసిన గణనాధుడు 9 రోజుల నవరాత్రులు పూజలు అందుకొని నిమజ్జనానికి తరలి వెళ్లాడు. ఈ గ్రామంలో గణేష్‌ని లడ్డును సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బిళ్లపాటి శ్రీనివాసరావు వేలంలో రూ.48 వేలకు దక్కించు కొన్నాడు. అలానే ముక్తేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసిన గణనాధుడి నిమజ్జన వేడుకలను గ్రామస్థు లు సమష్టి కృషితో నిర్వహిం చారు. సమీపంలోని ఏబీసీ కాలవలో నిమజ్జనం చేశారు. అన్ని గ్రామాలలో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం శనివారంతో పూర్తయ్యింది.

కోలాహలంగా గణనాథుని నిమజ్జనం

పంగులూరు : మండలంలోని తూర్పుకొప్పెరపాడు గ్రామంలో గణనాథుని నిమజ్జనోత్సవం గొట్టిపాటి యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొమ్మిదిరోజులుగా ప్రత్యేక మండపంలో కొలువుదీరిన గణనాదునికి శాస్రోక్తంగా పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీ శనివారం నిమజ్జనో త్సవం నిర్వహించారు. కోలా హలంగా సాగిన ఈ ఉత్సవంలో యువత, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవకమిటీ అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.

దేవరపల్లి లడ్డూకు రికార్డు ధర

దేవరపల్లి (పర్చూరు) : మండలంలోని దేవరపల్లిలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుని పందిరి వద్ద స్వామివారికి సమర్పించిన లడ్డూకు నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన తోకల నాగగౌతమ్‌ సాయి రూ.3.10 లక్షలకు దక్కించుకున్నారు. లడ్డూ కోసం వేలంలో పోటీ ఎక్కుగా సాగింది. వేలంలో దక్కించుకున్న లడ్డూతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. వినాయక పందిళ్ల వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి లడ్డూను దక్కించుకుంటే శుభం కల్గుతుందని భక్తుల నమ్మకం. అలాగే పర్చూరు లోని తూర్పువారి వీధిలో నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.40వేలకు ఆలా అనిల్‌ దక్కించుకోగా, టీనగర్‌లో నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.27 వేలకు గ్రామానికి చెందిన కాసా అశోక్‌ కుమార్‌ దక్కించు కున్నారు.

Updated Date - Sep 07 , 2025 | 01:41 AM