Share News

ఒక్కొక్కటిగా తరలుతున్న గణనాథుని విగ్రహాలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 01:32 AM

వినాయక నిమజ్జన ఉత్సవాలు శుక్రవారం ఉత్సహంగా సాగాయి. అద్దంకి పట్టణంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను శు క్రవారం రాత్రి గుండ్లకమ్మ నదిలో నిమజ్జనం చేశారు.

ఒక్కొక్కటిగా తరలుతున్న గణనాథుని విగ్రహాలు

అద్దంకి సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి) : వినాయక నిమజ్జన ఉత్సవాలు శుక్రవారం ఉత్సహంగా సాగాయి. అద్దంకి పట్టణంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను శు క్రవారం రాత్రి గుండ్లకమ్మ నదిలో నిమజ్జనం చేశారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాల నడుమ నిమజ్జనోత్సవాలు సాగాయి. పాత ఆంధ్రాబ్యాంక్‌ ఎదురు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఉంచిన లడ్డును లాటరీ ద్వారా ఆర్యవైశ్య నాయకుడు గోపు శ్రీనివాసరావు దక్కించుకున్నారు. అనంతరం 12 వ వార్డు కౌన్సిలర్‌ అత్తులూరి రమేష్‌ ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం ఉత్సాహంగా సాగింది. అద్దంకి పట్టణంలోని బలిజపాలెం, కాకానిపాలెం, యాదవుల బజారు, వైఎస్‌ఆర్‌ అపార్ట్‌మెంట్‌ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలతో పాటు మండలంలోని తిమ్మాయపాలెం, శంకవరప్పాడు తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక వి గ్రహాల నిమజ్జనాలు శుక్రవారం నిర్వహించారు. సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోటాపోటీగా వినాయకుల ఏర్పాటు

అద్దంకి : మండలంలోని నాగులపాడులో పోటాపోటీగా ఏర్పాటు చేసే రెండు వినాయక విగ్రహల నిమజ్జనోత్సవాలు ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు. ఈ నిమజ్జనోత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2004లో ప్రారంభమైన వినాయక విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనో త్సవాల నిర్వహణ ఏటికేడు ప్రత్యేకత సంతరించు కుం టోంది. గ్రామంలోని రెండు వర్గాలు రెండు దశాబ్దాలుగా పోటాపోటీగా భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు, నిమజ్జనోత్సవాలను లక్షల రూపాయలు వెచ్చించి ఘనంగా నిర్వహిస్తుంటారు. గత ఆరేడు సంవత్సరాలు గా గ్రామంలోని రెండు ప్రధాన వర్గాలు టీడీపీలోనే ఉన్నప్పటికీ, వినాయక విగ్రహాలను మాత్రం వేర్వేరు గానే ఏర్పాటు చేసి, ఎవరికి వారే ఘనంగా నిమజ్జన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కరి పరమేష్‌ వర్గం గొట్టిపాటి యూత్‌ పేరుతో నిమజ్జనోత్సవాలు నిర్వహిస్తుండగా, తెలుగు యువత నాయకులు పెంట్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో నాగులపాడు తెలుగుయువత పేరుతో వినాయక విగ్రహం ఏర్పాటు, నిమజ్జనోత్సవం నిర్వహిస్తుంటారు. రెండు వి గ్రహాలు తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుండండంతో ఇరువర్గాలు ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల వద్దకు మంత్రి రవికుమార్‌ హజరై పూజలు నిర్వహిస్తుంటారు. కొవిడ్‌ సమయంలో మినహా మిగిలిన అన్ని సంవత్సరాలలో రెండు వర్గాల ఆద్వర్యంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపులు ఉదయం నాగులపాడు గ్రామంలోని అన్ని ప్రధాన వీధులలో నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల సమయానికి అద్దంకి పట్టణంలోకి చేరుతుంది. భారీ సెట్టింగ్‌లు, విద్యుత్‌ వెలుగులు, వివిధ రకాల వాయిద్యాలు, కళాకారుల నృత్యాల మధ్య అద్దంకి పట్టణంలోని రామ్‌నగర్‌ నుండి భవానిసెంటర్‌ వరకు అర్ధరాత్రి వరకు ఊరేగింపులు నిర్వహిస్తారు. అద్దంకి పట్టణంతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాల లోని పలు ప్రాంతాల నుండి భక్తులు వినాయక నిమజ్జనోత్స వాలను తిలకించేందుకు భారీగా తరలివస్తారు.

నేడు వినాయక నిమజ్జనం

గొట్టిపాటి యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనోత్సవం శనివారం నిర్వహిస్తుండగా, నాగులపాడు తెలుగుయువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక వి గ్రహం నిమజ్జనోత్సవము ఈ నెల 13న నిర్వహించనున్నారు.

బల్లికురవ : వినాయకచవితి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులకు నవరాత్రుల పూజల అనంతరం శుక్రవారం ఘనంగా నిమజ్జన వేడుకలు నిర్వహించి వీడ్కోలు పలికారు. మండలంలోని గుంటుపల్లి శివాలయంలో, చినఅంబడిపూడి బొడ్డురాయి కూడలిలో ఏర్పాటు చేసిన గణనాథుల విగ్రహాల నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండు గ్రామాలలో గణనాథుల వద్ద ఏర్పాటు చేసిన లడ్డులను గ్రామ టీడీపీ నేతలు దద్దాల అంజయ్య, మలినేని గోవిందరావులు దక్కించుకొని పెద్ద ఎత్తున ఊరేగింపు మధ్య నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. గుంటుపల్లి గ్రామంలో దక్షిణం బజారులో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద శుక్రవారం రాత్రి ప్రముఖ భజన కళాకారుడు డప్పు శ్రీను బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Sep 06 , 2025 | 01:32 AM