ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:38 AM
కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు.
ఒంగోలు కార్పొరేషన్, జూలై 18 (ఆంధ్రజ్యో తి): కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. శుక్ర వారం ఒంగోలు ఆర్టీసీ డిపోలో నూతన బస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ అభి వృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఐదేళ్ళ వైసీపీ పాలనలో కాలం చెల్లిన బస్సులు నడిపిందన్నారు. జిల్లాలో 524 ఆర్టీసీ బస్సులు ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 164 కొత్త బస్సులు అందుబా టులోకి తీసుకువచ్చిందని చెప్పారు. అందులో ప్రత్యేకించి ఒంగోలు డిపోకే 35 బస్సులు కే టాయించినట్లు వివరించారు. ముఖ్యంగా రా ష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చే యనున్నట్లు తెలిపారు.
అందుకోసం సీఎం చంద్రబాబు నాయుడు అవసరమైన చర్యలు తీసు కున్నట్లు చెప్పారు. ఆర్‌ఎం సత్యనారాయణ మా ట్లాడుతూ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర భాగంగా ప్ర యాణికులకు సౌకర్యం కల్పించడంలో కచ్చిత మైన నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి బస్‌స్టేషన్‌లో ఆర్వో వాటర్‌ప్లాం ట్‌లు ఏర్పాటు, ఫ్యాన్‌లు, బస్టాండ్ ఆవరణాలు పరిశుభ్రత, కుర్చీలు అందుబాటులోకి తీసుకువ చ్చామని వెల్లడించారు. స్వచ్ఛతపై ప్రతి నాలు గు గంటలకు ఒకసారి రిజిస్టర్‌లో నివేదికలు రాసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కా ర్యక్రమంలో డిపో మేనేజర్ జి.శ్రీనివాసరావు, పీవో ఒ.శ్రీనివాసరావు, ఏవో హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే దామచర్ల బస్సును ఆర్టీసీ ప్రాంగణంలో కాసేపు నడిపి అందరినీ ఉ త్సాహపరిచారు.