సబ్సిడీ పరికరాలు ఇప్పిస్తామని మోసం
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:36 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీ వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద రూ.16.82 లక్షలు తీసుకొని ఓ వ్యక్తి మోసం చేశాడని దర్శికి చెందిన రైతులు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి 77మంది అర్జీలను అందజేశారు.

ఎస్పీ గ్రీవెన్స్‌లో రైతుల ఫిర్యాదు
ఒంగోలు క్రైం, మార్చి10 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీ వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద రూ.16.82 లక్షలు తీసుకొని ఓ వ్యక్తి మోసం చేశాడని దర్శికి చెందిన రైతులు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి 77మంది అర్జీలను అందజేశారు. అదనపు ఎస్పీ కె.నాగేశ్వరరావు, పోలీసు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని వారితో సావధానంగా మాట్లాడారు. అందుకు సంబంధించిన అధికారులతో మాట్లాడి సత్వరమే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. సబ్సిడీ పరికరాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నమ్మించి రూ.16.82 లక్షలు తమ వద్ద వసూలు చేశాడని దర్శికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. రెండేళ్లు గడిచినా పరికరాలు ఇప్పించకపోగా తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని పేర్కొన్నారు. అదేవిధంగా ఒంగోలుకు చెందిన ముగ్గురు వ్యక్తులు తన కుమారుడికి కరెంటు ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆరు లక్షలు తీసుకొని ఇంత వరకూ పని చేయకపోగా, అడిగితే బెదిరిస్తున్నారని ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు హజరత్తయ్య, జగదీష్, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.