కనిగిరిలో చిట్టీల పేరుతో మోసం
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:23 AM
కనిగిరి పట్టణంలో కొందరు పెద్ద మనుషుల్లా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఓసంఘం రాష్ట్ర కార్యదర్శి పదవిలో ఉన్న వ్యక్తి చిట్టీలు వేసి దాదాపు రూ.8 కోట్లతో ఉడాయించిన వైనం వెలుగుచూసింది.
మరికొంత వడ్డీలకు తీసుకుని.. రూ.8 కోట్లతో ఓ వ్యక్తి ఉడాయింపు
పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు
కనిగిరి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కనిగిరి పట్టణంలో కొందరు పెద్ద మనుషుల్లా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఓసంఘం రాష్ట్ర కార్యదర్శి పదవిలో ఉన్న వ్యక్తి చిట్టీలు వేసి దాదాపు రూ.8 కోట్లతో ఉడాయించిన వైనం వెలుగుచూసింది. దీంతో బాధితులు లబోదిబో మంటూ పోలీ్‌సస్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. మారెళ్ళ ఉమాకాంత్ పట్టణంలో దాదాపు 300 మంది రూ.2లక్షల నుంచి రూ.10లక్షల చిట్టీలు వేస్తుంటారు. విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సోదరుడైన ఉమాకాంత్‌ను నమ్మి అందరూ మోసపోయినట్లు తెలుస్తుంది. చీటీలు వేసి మోసపోయిన వారు కొందరైతే, అప్పులిచ్చి మోసపోయినవారు మరికొందరున్నారు. ఈనెల 17 నుంచి కనపడకుండా పోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఉమాకాంత్ కుటుంబసభ్యుల వద్దకు బాధితులు వెళ్ళి విచారించగా సరైన సమాధానం చెప్పలేదు. తమకు సంబంధం లేదన్నట్లు మాట్లాడటంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా బాధితులు అతనికి ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో బాధితులు సీఐ ఖాజావలిని కలసి ఫిర్యాదు చేశారు. కాగా ఉమాకాంత్ కుటుంబసభ్యులు గురువారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో అతను కనిపించకుండా వెళ్ళిపోయాడని ఫిర్యాదు చేయటం గమనార్హం.