Share News

ఉద్యోగాల పేరుతో మోసం

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:28 AM

ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేయడమే కాకుండా తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని సుదర్శ హిమబిందు గురువారం ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యా దు చేశారు.

ఉద్యోగాల పేరుతో మోసం

ఒంగోలు క్రైం, జూలై31(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేయడమే కాకుండా తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని సుదర్శ హిమబిందు గురువారం ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యా దు చేశారు. గత ఏడాది ఆగస్టులో పేర్నమిట్టకు చెందిన బండి నవీన్‌ ఉద్యో గాలు ఇప్పిస్తానంటూ తనతో పాటు తన స్నేహితుల వద్ద సుమారు రూ.10 లక్షలు నగదు తీసుకున్నాడని హిమబిందు తెలిపారు. ట్రిపుల్‌ఐటీ, ఐటీఐలలో అటెండర్‌పోస్టులు ఉన్నాయని చెప్పాడని, దీంతో అతనికి డబ్బులు ఇచ్చి ఏడాది నుంచి తిరుగుతున్నా సరైన సమాధానం చెప్పడం లేదని ఆమె ఫిర్యాదులో పే ర్కొంది. ఈమేరకు పేర్నమిట్టలో ఉన్న అతని ఇంటికి వెళ్ళి డబ్బులు అడగగా నవీన్‌, అతని భార్య భాగ్యలక్ష్మి కలిసి తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని హిమబిందు ఫిర్యాదు చేశారు. ఈమేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 01 , 2025 | 12:28 AM