నలుగురికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:23 AM
జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 78 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేయగా మన జిల్లా నుంచి వీరికి అవకాశం దక్కింది.
వారిలో ఒకరు హెచ్‌ఎం, ముగ్గురు స్కూలు అసిస్టెంట్లు
ఒంగోలు విద్య, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 78 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేయగా మన జిల్లా నుంచి వీరికి అవకాశం దక్కింది. వారిలో ఒక హైస్కూలు హెచ్‌ఎం, ముగ్గురు స్కూలు అసిస్టెంట్లు ఉన్నారు. తర్లుపాడు జడ్పీ హైస్కూలు హెచ్‌ఎం ముత్తోజి సుధాకర్, తంగెళ్ల జడ్పీ హైస్కూలు హిందీ స్కూలు అసిస్టెంట్ గుంటగాని భాస్కరరావు, పీసీపల్లి జడ్పీ హైస్కూలు సోషల్ స్కూలు అసిస్టెంట్ జి.ఈశ్వరమ్మ, వెలిగండ్ల మండలం మొగళ్లూరు జడ్పీ హైస్కూలు పీఎస్ స్కూలు అసిస్టెంట్ బి.సరోజనీదేని రాష్ట్ర అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు. శుక్రవారం విజయవాడ లయోలా కళాశాలలో జరిగే గురుపూజోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని పాఠశాల విద్య డైరెక్టర్ నుంచి వీరికి సమాచారం అందింది.