Share News

కార్యకర్తలకు కార్యాలయమే దేవాలయం

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:38 PM

టీడీపీ కా ర్యాలయం కార్యకర్తలకు దేవాలయంతో సమానమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పామూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఏర్పాటుచేసిన టీడీపీ కార్యాయలయాన్ని ఆపార్టీ మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు దంపతులతో కలిసి సోమవారం సా యంత్రం ఎమ్మెల్యే ప్రారంభించారు.

కార్యకర్తలకు కార్యాలయమే దేవాలయం
టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డిþ

పామూరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ కా ర్యాలయం కార్యకర్తలకు దేవాలయంతో సమానమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పామూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఏర్పాటుచేసిన టీడీపీ కార్యాయలయాన్ని ఆపార్టీ మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు దంపతులతో కలిసి సోమవారం సా యంత్రం ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా కార్యా లయంలో పూజలు నిర్వహించి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏ ర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర మాట్లాడు తూ తాను సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు నడు పుతానని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతులాకుతలం చేసిందన్నారు. అందుకే ఎన్నికల్లో ఆపార్టికి 11 సీట్లకే ప్రజలు పరిమితం చే శారన్నారు.

రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా చంద్ర బాబు నాయకత్వం లో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర అన్నారు. సంక్షేమం, అభివృద్ధి చేస్తూ సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలు అందిస్తున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. పామూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతోనే అభివృద్ధి పథకాలు కుంటుపడ్డాయన్నారు. ప్రజల పట్ల విశ్వాసం ఉన్న నాయకుడు చంద్రబాబు సార థ్యంలో తాము పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా అందరూ ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వైసీపీ నాయకులు చే స్తున్న గిమ్మిక్కులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. పీపీపీ విధానంపై జగన్‌ అసత్య ప్రచా రం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాగా, పామూరు మేజర్‌ పంచాయతికి చెందిన 6 వవార్డు మెంబర్‌ ఓగూరి బుజ్జమ్మ ఆధ్వర్యంలో 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అందరం కలిసికట్టుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయా లన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు, యారవ శ్రీను, పాలపర్తి వెంకటేశ్వర్లు, అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, పోకా నాయుడుబాబు, చుంచు కొండయ్య, మన్నం రమణయ్య, ఎన్‌.సాం బయ్య, ముబినామౌలాలి, ఆరెకొండ హరిప్రసాద్‌, సా ల్మన్‌రాజు, ఇర్రి కోటిరెడ్డి, జి.శ్రీనివాసులు, ఎన్‌.నాగేం ద్రచారి, ఓగూరి ఏడుకొండలు, నరసింహారావు, తెలుగు మహిళలు ఓ.సుబ్బమ్మ, రమణమ్మ, కేవీ రమణయ్య, వై.రహీముల్లా, దరిశి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:38 PM