పారిశుధ్యంపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:04 PM
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో బుధవారం పారిశుధ్య పనులను శ్రీనివాసరావు పరిశీలించారు.
పొదిలి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో బుధవారం పారిశుధ్య పనులను శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోర్స్ లెవల్లో సిగ్రిగేషన్ చేస్తున్న విధానాన్ని పరిశీలించి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని క్లాప్‌మిత్రలకు సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా శానిటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరాన్ని బట్టి వైద్య శిబిరానలను ఏర్పాటు చేయాలన్నారు. స్వర్ణ పంచాయతీ హౌస్‌టాక్స్, నాన్‌టాక్స్ సంబంధించిన అరియర్స్‌ను నెలాఖరులోపు వసూలు చేయాలని కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుత్తా శోభన్‌బాబు, సర్పంచ్ యాకోబు, పంచాయతీ కార్యదర్శి శేషగిరి, సచివాలయ సిబ్బంధి, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.