విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:00 PM
పిల్లలకు మెరుగైన విద్యతో పాటు వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు.
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పిల్లలకు మెరుగైన విద్యతో పాటు వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ చాంబర్‌లో మంగళవారం జిల్లా విద్యాశాఖాధిఽకారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వై ద్యం, ప్రజలకు తాగునీటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. కేవ లం రెగ్యూలర్ విధులకే పరిమితం కాకుం డా స్థానికంగా ఉన్న ఆయా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వివిధ కేటగిరీల వారీగా ఉన్న పా ఠశాలలు, కళాశాలల వివరాలను డీఈవో కిరణ్‌కుమార్, ఆర్‌ఐవో ఆంజనేయులు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో డిప్యూ టీ విద్యాధికారులు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్‌బాబు, సమగ్రశిక్ష అభియాన్ అధికారులు పాల్గొన్నారు.