Share News

జిల్లా కార్యాలయాలపై దృష్టి

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:39 PM

మార్పాపురం కొత్త జిల్లా కార్యాలయాల కోసం స్థలాల పరిశీలన మొదలైంది. శనివారం మార్కాపురం ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, స్థలాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేశు, ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ శివరామిరెడ్డి, తహసీల్దార్‌ చిరంజీవి తదితర అధికారులు పరిశీలించారు.

జిల్లా కార్యాలయాలపై దృష్టి

పలు చోట్ల స్థలాలు, భవనాలను పరిశీలించిన

ఎమ్మెల్యే కందుల, అధికారులు

మార్కాపురం రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : మార్పాపురం కొత్త జిల్లా కార్యాలయాల కోసం స్థలాల పరిశీలన మొదలైంది. శనివారం మార్కాపురం ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, స్థలాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేశు, ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ శివరామిరెడ్డి, తహసీల్దార్‌ చిరంజీవి తదితర అధికారులు పరిశీలించారు. పట్టణంలోని ఎస్‌వీకేపీ కాలేజీ భవనాలు, తర్లుపాడు రోడ్డులోని ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ పక్కనున్న డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయం కోసం అవసరమైన భవనాన్ని పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. అల్లూరి పోలేరమ్మ గుడి సమీపం గోగులదిన్నె పరిధిలో వెలిగొండ ముంపు గ్రామం, సుంకేసుల పునరావాస కాలనీలో కలెక్టర్‌ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పరిశీలించారు.

Updated Date - Dec 27 , 2025 | 11:39 PM