సగిలేరుకు వరద
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:46 PM
గిద్దలూరు పట్టణం మీదుగా వెళ్లే సగిలేరుకు వరద చేరు తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కొండపేట సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వెనుక ఉన్న నీటిగుండాల కారణంగా చిన్నపిల్లలు ఆప్రాంతాలకు వెళ్లవద్దని, ఈతకు వెళ్లేవారు కూడా వెళ్లకుండా పోలీసులను గస్తీ ఏర్పాటు చేశారు.
నీటి గుండాలతో అప్రమత్తంగా ఉండాలి
గిద్దలూరు టౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గిద్దలూరు పట్టణం మీదుగా వెళ్లే సగిలేరుకు వరద చేరు తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కొండపేట సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వెనుక ఉన్న నీటిగుండాల కారణంగా చిన్నపిల్లలు ఆప్రాంతాలకు వెళ్లవద్దని, ఈతకు వెళ్లేవారు కూడా వెళ్లకుండా పోలీసులను గస్తీ ఏర్పాటు చేశారు. అర్బన్ సీఐ కె.సురేష్ ఇప్పటికే ఒక ప్రకటనలో చిన్నపిల్లలను ఆప్రాంతాలకు పంపకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్దలు కూడా ఎవరూ ఈతకు వెళ్లరాదని తెలిపారు. కెఎ్‌సపల్లె, దిగువమెట్ట, ఉప్పలపాడు ప్రాంతాలలో కూడా సగిలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నీటితో భూగర్భజలాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు.
రామన్న కతువకు వరద
రాచర్ల : ప్రస్తుతం కురుస్తున్న వ ర్షాల కారణంగా రామన్న కతువకు వర్షపు నీరు భారీగా చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నల్లమ ల అడవుల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో వర్షపు నీరు రంగనాయక స్వామి దేవస్థానంలోని గుండానికి భారీగా చేరి అదనపు నీరంతా గుండం నుంచి గుండ్లకమ్మ వాగు ద్వారా చిన్నగానిపల్లె గ్రామ సమీపంలోని రామన్న కతువకు చేరుతోంది. వరదనీరు అధికంగా చేరడంతో కతువ నిండి అలుగు పారుతూ వరద నీటితో కళకళలాడుతుంది. వర్షాల ప్రభావంతో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చోళవీడు సమీపంలోని గుండ్లకమ్మ వాగు ద్వారా ప్రవహించే వరద నీరు అక్కపల్లి, తురిమెళ్ల గ్రామాల మీదుగా ప్రవహిస్తూ భారీ స్థాయిలో కంభం చెరువుకు చేరుతుంది.