Share News

ఐదుగురికి హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి

ABN , Publish Date - Jun 03 , 2025 | 01:48 AM

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఐదు గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయ పోస్టులను భర్తీచేశారు. సోమవారం అర్హులైన స్కూలు అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి కల్పించి ఆ పోస్టుల్లో నియమించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు.

ఐదుగురికి హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి

189 హైస్కూళ్లకు కొత్త హెడ్మాస్టర్లు

ఒంగోలు విద్య, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఐదు గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయ పోస్టులను భర్తీచేశారు. సోమవారం అర్హులైన స్కూలు అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి కల్పించి ఆ పోస్టుల్లో నియమించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు. గతనెల 30న నిర్వహించిన ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన మూడు, మే 31న రిటైర్మెంట్‌ ద్వారా వచ్చిన రెండు ఖాళీలను కలిపి నింపారు. సీనియారిటీ జాబితా సీరియల్‌ నంబరు 141 నుంచి ఉన్న స్కూలు అసిస్టెంట్లతో ఈ పోస్టులు భర్తీచేశారు. ప్రస్తుతం జడ్పీ యాజమాన్యంలోని హైస్కూళ్లలో ఒక్క హెచ్‌ఎం పోస్టు కూడా ఖాళీగా లేదు. జిల్లాలో బదిలీల ద్వారా 101 మంది, ఉద్యోగోన్నతుల ద్వారా మొత్తం 88 మంది కలిపి 189 హైస్కూళ్లకు కొత్త హెడ్మాస్టర్లు బాధ్యతలు స్వీకరించినట్లు అయింది.

Updated Date - Jun 03 , 2025 | 01:48 AM