పేదలకు పింఛన్‌తో ఆర్థిక భరోసా
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:17 PM
పేదలకు ఎన్టీఆర్ పింఛన్ పథకం ఆర్థిక భరోసాను ఇస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని అనుములవీడు గ్రామంలో శనివారం ఆయన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
రాచర్ల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పేదలకు ఎన్టీఆర్ పింఛన్ పథకం ఆర్థిక భరోసాను ఇస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని అనుములవీడు గ్రామంలో శనివారం ఆయన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ పథకాలన అర్హులైన ప్రతిఒక్కరూ వినియోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు. ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. టీడీపీ నాయకుడు అంబవరం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అశోక్‌రెడ్డికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్.వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఎల్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎంపీడీవో ఐ వెంకటేష్, కార్యదర్శి గణేష్, వీఆర్వో బి కిషోర్‌కుమార్, సర్పంచ్ పల్నాటి లతీఫ్, రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కె యోగానంద్, రాచర్ల సొసైటీ బ్యాంక్ చైర్మన్ జీవనేశ్వర్‌రెడ్డి, గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బి బాలయ్య, వైస్ చైర్మన్ ఓబుల్‌రెడ్డి, జిల్లా బీసీ సెల్ నాయకులు ఎన్ శ్రీనివాసులు, ఎస్సీ సెల్ నాయకులు వై సంజయ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చప్పిడి శ్రీనివాసరావు, పి ఆంజనేయులు, ఎస్సీసెల్ నాయకుడు టి దివాకర్, జనసేన పార్టీ నాయకుడు శంకర్‌నాయుడు పాల్గొన్నారు.
ప్రతి నెలా ఆలస్యం లేకుండా పింఛన్ : ఎమ్మెల్యే కందుల
మార్కాపురం : ప్రజా ప్రభుత్వంలో పేదలకు ప్రతి నెలా 1వ తేదీన ఎలాంటి ఆలస్యం లేకుండా వేకువజామునే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 8వ వార్డులోని గొర్లగడ్డలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పేద ప్రజల కోసం ఎలాంటి ఆలస్యానికి తావులేకుండా పింఛన్లను అందిస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రఽధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మీరావలి, కౌన్సిలర్ దొడ్డా భాగ్యలక్ష్మి, పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీంఖాన్, షేక్ మౌళాలి, వార్డు టీడీపీ నాయకులు షాకీర్‌హుసేన్, జాబీర్, వలి, పఠాన్ హుసేన్‌ఖాన్, గులాబ్ పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : వృద్ధులకు సంతోషాన్ని ఇవ్వాలన్నదే చంద్రబాబు ధ్యేయమని ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు అన్నారు. స్థాని క వార్డులలో ఆయనతోపాటు టీడీపీ మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లను శనివారం పంపిణీ చేశారు.
రాచర్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మొదటిరోజే 95ుమేర పంపిణీ చేసినట్లు ఎంపీడీవో ఎస్ వెంకటరామిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన కాలువపల్లి పంచాయతీలో పెన్షన్‌లను సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. అందుబాటులో లేని వారికి సోమవారం పంపిణీ చేస్తారని ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో వెంకటేష్, టీడీపీ నాయకుడు ముత్తుముల రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సొంత నిధులతో రూ.8వేల పింఛన్ అందజేత
కంభం : కంభం మండలంలో ఇద్దరికి ఎ మ్మెల్యే అశోక్‌రెడ్డి సొం త నిధుల నుంచి రూ.8 వేలు పెన్షన్‌ను టీడీపీ నాయకులు శనివారం పంపిణీ చేశారు. రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గోన చెన్నకేశవులు మాట్లాడుతూ కంభం అర్బన్ కాలనీకి చెందిన రాచమల్లు కృష్ణ, తెలుగు వీధికి చెందిన పీ లోకేష్ అనే దివ్యాంగుడికి పింఛన్ రావడం లేదు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వారికి పింఛన్ మంజూరయ్యే వరకూ తానే ఇస్తానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రతి నెలా 1వ తేదీన అందరితోపాటు వారికి కూడా పింఛన్‌ను అందజేస్తున్నట్లు చెన్నకేశవులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.