Share News

పీహెచ్‌సీలో భయం భయం

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:48 AM

ఒక వైపు స్యచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రతి నెల పరిశుభ్రం చేయిస్తున్నామని చెబుతున్న క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కావడం లేదు.

పీహెచ్‌సీలో భయం భయం

బల్లికురవ. జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ఒక వైపు స్యచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రతి నెల పరిశుభ్రం చేయిస్తున్నామని చెబుతున్న క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్దఎత్తున పిచ్చి మొక్కలు పెరిగిన అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో వైద్యం కోసం వచ్చే రోగులు దట్టంగా ఉన్న పిచ్చి చెట్లను చూసి భయాందోళన చెందుతున్నారు. వైద్యశాలలోనే ఇలా ఉంటే అంటువ్యాధులు ప్రబలవా అని వారు ప్రశ్నిస్తున్నారు.

బల్లికురవ మండలంలోని గుంటుపల్లి ప్రాథమిక అరోగ్యకేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. వైద్యశాల నలువైపులా పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో పాటు గోడలపైకి కూడా చెట్లు ఎగబాకాయి. దీంతో పీహెచ్‌సీలో దోమల బెడద కూడా అధికంగా ఉందని రోగులు వాపోతున్నారు. వైద్యశాల మాత్రం లోపల చాలా శుభ్రంగా ఉందని బయటకు వస్తే చూట్టుతా పనికి రాని పిచ్చి మొక్కలు చి ట్టడవిని తలపించేలా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. వైద్యశాల ఆవరణ మెత్తం పారిశుధ్య పనులు చేయించాలని లేకుంటే ముందు ముందు భారీ వర్షాలు పడితే వైద్యశాలకు వచ్చే రోగులకు అంటువ్యాధుల ముప్పు పొంచి ఉందని వారు అంటున్నారు. అధికారులు కూడా ప్రతి నెల ఒక గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేయిస్తున్నామని చెబుతున్న ఎక్కడ అమలు కావడం లేదని ఫోటోలు తీసి పంపడమే కాని క్షేత్రస్థాయిలో ఎక్కడ సరిగా పనిచేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామాలలో రోడ్లవెంబడి కూడా చెత్త రోజురోజుకు పేరకు పోతుందని వారు తెలిపారు. ఇప్పటికైనా సంబందిత అదికారులు స్పందించి వెంటనే ప్రాథమిక అరోగ్య కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య పనులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 02 , 2025 | 12:49 AM