ట్రాక్టర్ ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:05 AM
ట్రాక్టర్ ప్రమాదంలో తండ్రీ కొడుకు మృతి చెందారు. ఈ ఘటన పొదిలి మండలం సలకనూతలలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సలకనూతలకు చెందిన మాదాల కోటేశ్వరరావు (60), వెంకటేశ్వర్లు (25) తండ్రీకొడుకులు.
సలకనూతలలో విషాదం
పొదిలి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ట్రాక్టర్ ప్రమాదంలో తండ్రీ కొడుకు మృతి చెందారు. ఈ ఘటన పొదిలి మండలం సలకనూతలలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సలకనూతలకు చెందిన మాదాల కోటేశ్వరరావు (60), వెంకటేశ్వర్లు (25) తండ్రీకొడుకులు. ఇద్దరూ రైతులు. మంగళవారం సాయంత్రం వారు పశువుల కొష్టం వద్దకు వెళ్లారు. వెంకటేశ్వర్లు ట్రాక్టర్‌ను పక్కన నిలిపే క్రమంలో అది తండ్రి కోటేశ్వరరావుకు తగిలింది. దీంతో కిందపడిపోయిన అతనిపై నుంచి ట్రాక్టర్ వెళ్లిపోయింది. కంగారు పడిన వెంకటేశ్వర్లు ఒక్కసారిగా ట్రాక్టర్‌పై నుంచి దూకాడు. ఆ క్రమంలో బలమైన గాయమై ఆయన కూడా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.