వేగంగా రేషన్ పంపిణీ
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:36 AM
జిల్లాలో రేషన్ పంపిణీ వేగంగా జరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 39.77శాతం మందికి సరుకులు అందాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుకాణాల ద్వారా రెండు పూటలా కార్డుదారులకు సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
రెండు రోజుల్లో 39.77 శాతం మందికి సరుకులు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రేషన్ పంపిణీ వేగంగా జరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 39.77శాతం మందికి సరుకులు అందాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుకాణాల ద్వారా రెండు పూటలా కార్డుదారులకు సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో త్వరగా రేషన్ అందుతోంది. జిల్లాలో 38 మండలాలు ఉండగా మంగళవారం సాయంత్రానికి 39.77శాతం మందికి సరుకులు అందాయి. ఒంగోలు డివిజన్‌లో 509 రేషన్ షాపుల పరిధిలో 2,54,727 కార్డులు ఉండగా 98,238 కార్డుదారులు రేషన్ అందుకున్నారు. కనిగిరి డివిజన్‌లో 424 షాపుల పరిధిలో 1,96,148 కార్డులు ఉండగా మంగళవారం సాయంత్రానికి 79,659 మందికి రేషన్ పంపిణీ జరిగింది. మార్కాపురం డివిజన్‌లో 459 షాపుల పరిధిలో 2,10,266 కార్డులు ఉండగా 85,054 మంది రేషన్ అందుకున్నారు. జిల్లా మొత్తంగా చూస్తే 1,392 దుకాణాల పరిధిలో 6,61,141 కార్డులు ఉండగా 2,62,952 కార్డుదారులు రేషన్ తీసుకున్నారు.