రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:45 PM
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సీఎస్‌పురం మండ లంలోని కంభాంపాడు, ఉప్పలపాడు గ్రామాల్లో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
సీఎస్‌పురం(పామూరు), నవంబరు 24(ఆంధ్రజ్యో తి): రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సీఎస్‌పురం మండ లంలోని కంభాంపాడు, ఉప్పలపాడు గ్రామాల్లో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లా డుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రజాప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. రైతును రాజును చేసేందుకు ఐదు విధానాలతో కార్యాచరణను అమలుచే యనున్నట్టు చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రైతన్న మీ కోసం పథకాన్ని రూపొందించిందని చెప్పా రు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి రైతులకు రాసిన లేఖలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొబ్బూరి రమేష్, పామూరు, సీఎస్‌పురం సింగిల్‌విండో చైర్మన్‌లు ఉప్పలపాటి హరి బాబు, సీహెచ్ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ శ్రీరాం పద్మావతి, ఎన్‌సీ మాలకొండయ్య, ఏడీఏ జైనాలుధ్ధీన్, ఏవో సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎ స్‌పురంలోని శివాలయంలో వీధిలో జరిగిన కార్యక్రమం లో ఎన్టీఆర్ రైతు భరోసా, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు.
పామూరు: రైతు సంక్షే మమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నాయకుడు యారవ శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పడమటకట్టకిందపల్లి గ్రామంలో అన్న దాత-సుఖీభవ, పీఎం కిసాన్ పథకం నగదు పడిన లబ్ధిదారుల రైతన్న మీకోసం యాప్‌లో నమోదుచేసే కార్యక్రమంలో యార వ పాల్గొన్నారు. ఈసందర్భంగా రైతులకు కరపత్రాలు అందజేసి మాట్లాడారు. వ్యవసా యాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్, వీఆర్వో శివశంకర్, వ్వవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. బొట్లగూడూరులో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, సర్పంచ్ వై.బాల, నీటి సంఘం చైర్మన్ కమ్మ ప్రసాద్, వీఆర్వో షేక్ గరీబా, రైతులు పాల్గొన్నారు.
వెలిగండ్ల: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఏకైక లక్ష్యంగా రైతన్న మీకోసం అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని టీడీపీ మండల అధ్య క్షుడు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి అన్నారు. మండలం లోని మరపగుంట్ల గ్రామంలో సోమవారం ఈకార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రజాప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి టి.శిల్ప, అక్రమ్, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, కోండు భాస్కర్‌రెడ్డి, కర్నాటి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పీసీపల్లి: రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల నాయకుడు వేమూరి రామయ్య అన్నారు. రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం పీసీపల్లిలో వ్యవసాయ అధికారి ఎన్. రంగాకృష్ణతో కలిసి అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో లబ్ధిపొందిన రైతులకు ప్రభుత్వ సందేశ కరపత్రాలను పంపిణీచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచేది ప్రజాప్రభు త్వమేనని అన్నారు. కార్యక్రమంలో ఏఈవో షబాన, వీఏఏ శ్రావణి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, వెంగయ్య, రమేష్, నాగేంద్ర బాబు, సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.