Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:50 PM

రై తు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు. సోమవారం మన్నేపల్లి సొసైటీ అధ్యక్షుడి గా గొంది రమణారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సొసైటీ చైర్మన్‌ రమణారెడ్డిని సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు

మాజీ ఎమ్మెల్యే పాపారావు

తాళ్లూరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రై తు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు. సోమవారం మన్నేపల్లి సొసైటీ అధ్యక్షుడి గా గొంది రమణారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మన్నేపల్లి సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన ఈకార్యక్రమంలో పాల్గొన్న పాపారావు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రైతులకు ఎలాంటి మే లు జరగలేదన్నారు. సీఎం చంద్రబాబు రైతులు పడుతున్న కష్టాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారని చెప్పారు.

మన్నేపల్లి సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా రైతులకు అవసరమైన సేవలు అందిస్తామన్నారు. కష్టపడే కార్యకర్తలకు టీడీపీ సము చిత స్థానం కల్పిస్తుందని చెప్పారు. అందుకు తానే నిదర్శనమ న్నారు. తనకు అవకాశం కల్పించిన టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌, నేతలకు రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుం దన్నారు.

కార్యక్రమంలో నాగంబొట్లపాలెం సొసైటీ చైర్మన్‌ వల్లభనేని సుబ్బయ్య, దర్శి సహకార సంఘం అధికారి జిలానీ బాషా, తూర్పుగంగవరం పీడీసీసీ బ్యాంక్‌ మేనేజర్‌ మాధవరావు, ఏఎంసీ డైరెక్టర్లు కాశీంసైదా, హనుమారెడ్డి, సొసైటీ సభ్యులు కె.శ్రీనివాసరావు, ఎన్‌.వీరరాఘవులు, నాయకులు తూము శివనాగిరెడ్డి, వెలుగు ఏడుకొండలు, అనపర్తి ఎఫ్రయిమ్‌, నాదెండ్ల శ్రీను, మహబూబ్‌ సుభాషినీ(బుజ్జి), ఆదినారాయణరెడ్డి, వంగపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:50 PM