Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:37 PM

రైతు సంక్షేమమే ప్రజాకూటమి ప్రభుత్వం లక్ష్యమని పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు. వేల ఎకరాల్లో సాగుచేసుకున్న నల్లబర్లీ పొగాకు కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు ముందుకు రావడం చరిత్మాక అంశమన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మార్క్‌ఫెడ్‌ డీఎంను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

బర్లీ పొగాకు కొనుగోలు చరిత్రాత్మకం

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు, జూన్‌ 18 (ఆంరఽధజ్యోతి) : రైతు సంక్షేమమే ప్రజాకూటమి ప్రభుత్వం లక్ష్యమని పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు. వేల ఎకరాల్లో సాగుచేసుకున్న నల్లబర్లీ పొగాకు కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు ముందుకు రావడం చరిత్మాక అంశమన్నారు. బుధవారం పర్చూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ఏర్పాటు చేసి నేడు ప్రారంభించనున్న నల్లబర్లీ పొగాకు కేంద్ర ప్రాంగణాన్ని, గోడౌన్లను ఎమ్మెల్యే ఏలూరి మార్క్‌ఫెడ్‌ డీఎం కరుణశ్రీ, వ్యవసాయ అధికారులు, రైతుల నేతృత్వంలో పరిశీలించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లబర్లీ రైతులను ఆదుకొని న్యాయం చేసేందుకు కొనుగోలుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం రూ.300 కోట్ల బడ్జెట్‌ కేటాయించిందన్నారు. అవసరమైతే మరో రూ.వెయ్యి కోట్లు కూడా కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రైతుల వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండు గ్రేడ్‌ల ద్వారా నాణ్యమైన పొగాకు క్వింటా రూ.12000, లోగ్రేడ్‌ పొగాకు రూ.6000 చొప్పున కొనుగోలు చేస్తారన్నారు. ఇప్పటికే రైతుల వివరాలను వ్యవసాయశాఖ ద్వారా సేకరించినట్లు తెలిపారు. మార్క్‌ఫెడ్‌ డీఎం కరుణశ్రీ, ఏడీఎ ఎన్‌.మోహనరావు, ఎవోలు రామమోహనెడ్డి, భాస్కర్‌రావు, నాయకులు వెంకట్రావు, నాయుడు హనుమంతురావు, షంషుద్దీన్‌, ఏజీపీ నరేంద్రకుమార్‌, కారుమంచి కృష్ణ, కొల్లా శ్రీనివాసరావు, పోట్రు శోభన్‌, రాముడు, వెంకటేశ్వర్లు, శివరాంప్రసాద్‌, పోపూరి శ్రీనివాసరావు, పఠాన్‌ సమీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:37 PM