రైతుల సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:40 PM
రైతుల సంక్షేమం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్యెల్యే విజయ్‌కుమార్ చెప్పారు. సూపర్‌సిక్స్ హామీలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత రూ.7 వేలు నిధులు జమ చేసిన సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో రైతు సంబర సభను బుధవారం సాయంత్రం పల్లామల్లిలో అట్టహాసంగా నిర్వహించారు.
అన్నదాత సుఖీభవ అమలుతో ఆనందడోలికల్లో రైతులు
పల్లామల్లిలో రైతులు శత ట్రాక్టర్లతో అభినందన ర్యాలీ
ఎద్దులబండిపై ర్యాలీలో పాల్గొన్న విజయ్‌కుమార్‌కు నీరాజనం
చీమకుర్తి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్యెల్యే విజయ్‌కుమార్ చెప్పారు. సూపర్‌సిక్స్ హామీలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత రూ.7 వేలు నిధులు జమ చేసిన సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో రైతు సంబర సభను బుధవారం సాయంత్రం పల్లామల్లిలో అట్టహాసంగా నిర్వహించారు. దాదాపు వంద ట్రాక్టర్లతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అగ్రభాగాన రైతులతో కలిసి ఎద్దుల బండిపై సవారీ చేసిన ఎమ్మెల్యేకు అడుగడుగునా జననీరాజనం లభించింది. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన సభలో విజయ్‌కుమార్ ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం గత ఏడాదికాలంలో ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను వివరించారు. దాదాపు రూ.300కోట్లతో బర్లీపొగాకు పండించిన రైతులను ఆదుకున్నారన్నారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గుండ్లకమ్మ జలాశయం గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడినట్లు చెప్పారు. అలాగే కారుమంచి మేజర్ కట్ట పునరుద్ధరణ, రామతీర్థం గేట్లకు మరమ్మతులకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా సూపర్‌సిక్స్ హామీలు అమలు చేస్తుండడంతో ప్రజలు సంతోషకరంగా ఉన్నారన్నారు. ఈ నెల 15నుంచి మహిళలకు ఉచితబస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, రైతుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నం ప్రసాద్, గొట్టిపాటి రాఘవరావు, మండవ జయంత్‌బాబు, ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, తేళ్ల మనోజ్‌కుమార్, మద్దినేని హరిబాబు, కూనంనేని లోకేష్, అన్నంనేని రాఘవయ్య, పారా చంద్రశేఖర్, కరిచేటి వెంకటేశ్వరరావు, ఎనికపాటి లక్ష్మీనరసయ్య, బొమ్మల అంకయ్య, మేడిబోయిన శ్రీనివాసరావు, వేల్పుల శ్రీనివాసరావు, ఇస్తర్ల ఏడుకొండలు, రాజశేఖరరెడ్డి, యానం వెంకటేశ్వర్లు, సరికొండ చిరంజీవిరాజు, పొందూరి హరిబాబు, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.