రైతులు పథకాలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - May 29 , 2025 | 11:20 PM
రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆదాయ మార్గాలను పెంచుకోవాలని నూనెగింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త ప్రద్యుమ్న యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని ఆముదాలపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వికసిత్ కృషి సంకల్ప అభిమాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
శాస్త్రవేత్త ప్రద్యుమ్నయాదవ్
పొదిలి, మే 29 (ఆంధ్రజ్యోతి) : రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆదాయ మార్గాలను పెంచుకోవాలని నూనెగింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త ప్రద్యుమ్న యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని ఆముదాలపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వికసిత్ కృషి సంకల్ప అభిమాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల ఆదాయం పెంచడం, ఖర్చు తగ్గించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఎరువులు, పురుగుమందులు ఏ సమయంలో వాడితే మంచి దిగుబడులు వస్తాయనే విషయాలను రైతులు గమనించాలన్నారు. రైతులు మట్టి పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. నూనె గింజల సాగును పెంచాలన్నారు. డ్రోన్ల వినియోగంతో ఖర్చు తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో ఆత్మ పీడి విజయనిర్మల, డీపీఎం సుభాషిణి, దర్శి కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వరరెడ్డి, ఏపీసీడ్స్ మేనేజర్ బుచ్చమ్మ, పొదిలి వ్యవసాయాధికారి షేక్ జైన్‌లాబ్దీన్, ఉద్యాన అధికారి సంధ్య, జిల్లా వనరుల వ్యవసాయాధికారి శేషమ్మ, వ్యవసాయసహాయకులు నర్మద, సర్పంచ్ శ్రీనివాసులు రైతులు పాల్గొన్నారు.