Share News

పొగాకు సాగులో రైతులు జాగ్రత్తలు పాటించాలి

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:44 AM

పొగాకు సాగులో రైతులు తగుజాగ్రత్తలు పాటించాలని ఒంగోలు రెండో పొగాకు వేలం కేంద్ర నిర్వహణాదికారి జె .తులసి స్పష్టం చేశారు. వేలం కేంద్రం పరిధిలోని చీర్వానుప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం పొగాకు రైతులతో సమావేశం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బోర్డు అధికారులు సిపార్సు చేస్తేనే పురుగు మందులువాడాలని, అధికారుల అనుమతి లేకుండా వాడవద్దని రైతులకు సూచించారు.

పొగాకు సాగులో రైతులు జాగ్రత్తలు పాటించాలి
చీర్వానుప్పలపాడులో పొగాకురైతుల సమావేశంలో మాట్లాడుతున్న వేలం కేంద్రం నిర్వహణాధికారి తులసి

ఒంగోలు(రూరల్‌),డిసెంబరు15(ఆంధ్రజ్యోతి):పొగాకు సాగులో రైతులు తగుజాగ్రత్తలు పాటించాలని ఒంగోలు రెండో పొగాకు వేలం కేంద్ర నిర్వహణాదికారి జె .తులసి స్పష్టం చేశారు. వేలం కేంద్రం పరిధిలోని చీర్వానుప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం పొగాకు రైతులతో సమావేశం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బోర్డు అధికారులు సిపార్సు చేస్తేనే పురుగు మందులువాడాలని, అధికారుల అనుమతి లేకుండా వాడవద్దని రైతులకు సూచించారు. పొగాకు పంట పొలాల గట్లపై బంతి ,ఆముదము మొక్కలునాటి పెంచాలన్నారు. ఈ మొక్కలతో కొంతమేరకు పురుగు ఉధృతిని నివారించుకోవచ్చునని తెలిపారు. పొగాకు పొలాలలో లింగాకర్షణ బుట్టలు, జిగురు అట్టలను పొలంలో పెట్టడం వల్ల పురుగులను నివారించవచ్చన్నారు. పొగతోటలలో మల్లెను పూర్తిగా తొలిగించి తగులబెట్టాలన్నారు. అలాగే పొగతోటలలో అంతర సేద్యం చేయడం వల్ల అధిక ఉత్పత్తి పొందవచ్చన్నారు. ఈకార్యక్రమంలో ఐటీసీ మేనేజర్‌ వినోద్‌, జీపీఐ మేనేజర్‌ ఉన్నం శ్రీనివాసరావు , బోర్డు సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:44 AM