రైతులు పొగాకు సాగును తగ్గించుకోవాలి
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:39 PM
చైనా, బ్రెజిల్ వంటి దేశాలలో పొగాకు పంట ఉత్పత్తి పెరిగినందున భారతదేశం నుంచి ఎగుమతులు తగ్గేపరిస్థితులు ఉన్నాయని, రైతులు పొగాకు సాగును తగ్గించుకోవాలని ఒంగోలు పొగాకు రెండో వేలం కేంద్రం నిర్వహణాధికారి జె.తులసి స్పష్టం చేశారు. వేలం కేంద్రంలో పొగాకు పంట నియంత్రణ - ప్రత్యామ్నాయపంట
ఒంగోలు(రూరల్),సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): చైనా, బ్రెజిల్ వంటి దేశాలలో పొగాకు పంట ఉత్పత్తి పెరిగినందున భారతదేశం నుంచి ఎగుమతులు తగ్గేపరిస్థితులు ఉన్నాయని, రైతులు పొగాకు సాగును తగ్గించుకోవాలని ఒంగోలు పొగాకు రెండో వేలం కేంద్రం నిర్వహణాధికారి జె.తులసి స్పష్టం చేశారు. వేలం కేంద్రంలో పొగాకు పంట నియంత్రణ - ప్రత్యామ్నాయపంటలు అనే అంశంపై పొగాకు రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేలంకేంద్ర అధికారి మాట్లాడుతూ 2024-2025 సంవత్సరానికి సంబంధించి పొగాకు సాగు అధికంగా చేయడంతో ఉత్పత్తి పెరిగి ధరలు లేక పోయిన విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే సీజన్‌లో రైతులు తీవ్రనష్టాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు ఇప్పడు ఉన్న పరిస్థితులు తెలుసు కొని పొగాకు పంటసాగును తగ్గించుకోవాలని, ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. పొగాకు పంట సాగు చేసే రైతులు తప్పక నారుకొనుగోలు రశీదును నారు అమ్మకాలు చేసేవారి నుంచి పొందాలన్నారు. అలాగే రైతులు బ్యారన్‌ల లీజులు, భూముల లీజ్‌లు అధిక ధరలకు తీసుకోవద్దని వివరించారు. ఈకార్యక్రమంలో ఐటీసీ మేనేజర్ వెంకటేశ్, జీపీఐ మేనేజర్ కిషోర్, పీఎ్‌సఎస్ మేనేజర్ ఆదిత్య, పొగాకు రైతులు, బోర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.