రైతులకు మెరుగైన సేవలందించాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:24 PM
రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నూతన సొసైటీ ప్రెసిడెంట్‌లకు సూచించారు.
మార్కాపురం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నూతన సొసైటీ ప్రెసిడెంట్‌లకు సూచించారు. స్థానిక జవహర్‌నగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుఽధవారం మార్కాపురం, మిట్టమీదిపల్లి సొసైటీ ప్రెసిడెంట్లు జవ్వాజి రామాంజులరెడ్డి, గొలమారి నాసర్‌రెడ్డిలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుశ్శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల శ్రీనివాసులు, మట్టం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.