రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:13 AM
కొమ్మమూరు కాలువపై లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు అపోహ మాత్రమే అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.
స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : కొమ్మమూరు కాలువపై లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు అపోహ మాత్రమే అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధమ కర్తవ్యమని పేర్కొన్నారు. రైతాంగానికి నష్టం చేసే చర్యలను తమ ప్రభుత్వం చేపట్టదన్నారు. వైసీపీ రాజకీయ ఉచ్చులోనికి రైతులను లాగుతోందని, రైతులు ఆ ఉచ్చులో పడవద్దన్నారు. ఈ అంశానికి స్పందించిన పూర్వాపరాలను ఆయన వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల ప్రయోజనం పీ4 పథకాన్ని చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారన్నారు. సీఎం పిలుపు మేరకు ఈ పథకంలో భాగమయ్యేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్ ముందుకు వచ్చాడన్నారు. బాపట్ల జిల్లా అప్పాపురం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మించి ప్రాంత రైతులకు మేలు చేయాలనే ఉద్దేఽశ్యంతో పెట్ట బడి పెట్టేందుకు ముందుకు వచ్చాడన్నారు. అయితే డీపీఆర్ తప్పుల తడకగా ఉంద న్నారు. దానిపై సాంకేతిక పరంగా లోపాలు ఉన్నాయని గుర్తించి, ప్రభుత్వం నాలుగు నెలల క్రితమే ఈ ప్రతిపాదనను తిరస్కరిం చిందన్నారు. ఈ పథకానికి సంబంధించి సాంకేతిక అంశాలపై తాను కూడా స్వయంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. ఈపథకం ఏర్పాటు కు సంబంధించి ఏమైన అనుమానాలు ఉంటే సంబంఽధితశాఖ మంత్రి, అధికారులతో నివృత్తి చేయించే భాద్యత తనదేనని, రైతులు ఎవ్వరూ అందోళన చెందాల్సిన పనిలేదని ఎమ్మెల్యే స్పష్టమైన భరోసా ఇచ్చారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ ఉచ్చులో పడవద్దన్నారు. గత వైసీపీ ఐదేఽళ్ల పాలనలో కొమ్మమూరు కాలువలను నిర్లక్ష్యం చేసిందని, కనీసం మరమ్మతులు కూడా కల్పించ కపోవడంతో కాలువ మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం అధి కారం చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనే చివరి భూములకు కూడా నీరు అందేలా కృషి చేస్తున్నామన్నారు. రైతులు ఏ ప్రాంతంలో ఉన్నా, వారి ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమన్నారు.