Share News

లక్షాధికారులుగా రైతులు

ABN , Publish Date - Nov 30 , 2025 | 10:41 PM

రైతులను లక్షాధికారులను చే యడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఆదివారం మండలంలోని మర్రివేముల గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమా న్ని నిర్వహించారు. ముందుగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కరపత్రాలను పంపిణీ చేశారు.

లక్షాధికారులుగా రైతులు
రైతులనుద్దేశించి మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

అదే ప్రభుత్వ లక్ష్యం

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

పుల్లలచెరువు,నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : రైతులను లక్షాధికారులను చే యడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఆదివారం మండలంలోని మర్రివేముల గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమా న్ని నిర్వహించారు. ముందుగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు పె ట్టుబడి సాయాన్ని అందజేస్తోందన్నారు. సబ్సిడీపై యూరియాను, వ్యవసాయ పరికరాలను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు చిరుధాన్యాలను పండించి మీతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయాలన్నారు. పేద రైతులు భూముల ఆన్‌లైన్‌ కోసం కార్యాలయం చుట్టూ తిప్పకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. ఎన్నికల ముందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నారన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలపాలని ఎరిక్షన్‌బాబు అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు పోట్ల గోవింద్‌, టీడీపీ మండల నాయకులు కాకర్ల కోటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, భాస్కర్‌, కుమార్‌, పయ్యావుల ప్రసాద్‌, మేడికొండ లక్ష్మి నారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మేడికొండ అనిల్‌ కుమార్‌ చౌదరి, జనసేన పార్టీ మండలాధ్యక్షుడు కొటారి అచ్చయ్య, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 10:41 PM