ఉసురు తీసిన అప్పులు
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:21 AM
అప్పుల బాధతో పొలంలోనే పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన ఓబులరెడ్డి రమణయ్య (50) తనకున్న నాలుగెకరాల పొలంలో కొన్నేళ్లుగా మిర్చి సాగు చేస్తున్నారు.
గొల్లపల్లిలో రైతు ఆత్మహత్య
త్రిపురాంతకం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : అప్పుల బాధతో పొలంలోనే పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన ఓబులరెడ్డి రమణయ్య (50) తనకున్న నాలుగెకరాల పొలంలో కొన్నేళ్లుగా మిర్చి సాగు చేస్తున్నారు. కొంత పొలం కౌలుకు తీసుకుని వరి కూడా వేస్తున్నారు. పంటలు సక్రమంగా పండకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. రూ.20లక్షల వరకూ అప్పులు ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఈ విషయమై మంగళవారం భార్యతో గొడవ జరిగింది. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. అప్పులు తీర్చే మార్గం కన్పించక పొలంలోనే పురుగు ముందు తాగారు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నారు. రమణయ్య అల్లుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివబసవరాజు తెలిపారు.