ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతి
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:40 PM
పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఒంగోలులో చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
మార్కాపురం రూరల్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఒంగోలులో చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం మండలం కోలభీమునిపాడు గ్రామానికి చెందిన రైతు మందా సత్యనారాయణరెడ్డి(45) కౌలుకు పొలం తీసుకుని 12 ఎకరాలలో పత్తి, 2 ఎకరాలలో మిరప పంటలను సాగు చేస్తున్నారు. లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి దెబ్బతింది. మనస్తాపానికి గురై గత నెల 26న పొలంలోనే పురుగు మందు తాగారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. సత్యనారాయణరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ అంకమ్మరావు తెలిపారు.