పాము కాటుకు గురై రైతు మృతి
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:09 AM
పాముకాటుకు గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని తిమ్మనపాలెం గ్రామం లో శుక్రవారం ఉదయం చోటు చేసుకొంది.
అద్దంకి, ఆగస్టు22 (ఆంధ్రజ్యోతి): పాముకాటుకు గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని తిమ్మనపాలెం గ్రామం లో శుక్రవారం ఉదయం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు(40) శుక్రవారం ఉదయం పొలానికి పశువుల మేత కోసం వెళ్లాడు. అక్కడ పాము కరవడంతో కుటుంబ సభ్యులకు పోన్‌లో సమాచారం అందించి, నేరుగా అద్దంకిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు వచ్చాడు. అక్కడ వారు వైద్యం నిరాకరించడంతో అదే వాహనం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి అక్కడే కుప్పకూలాడు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.