Share News

విస్తారంగా మొక్కజొన్న సాగు

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:42 PM

మండలంలో రబీ సీజనులో మొక్కజొన్నపైరున రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా మిర్చి,పత్తి సాగు చేసేవారు అయితే ఈ ఏడాది మొంఽథా తుఫాన్‌ కారణంగాకురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన వరద ప్రవాహం పంటలను ముంచెత్తింది. దీంతో తీవ్రంగా నష్ట పోయిన రైతులకు దిక్కుతోచలేదు.ఇప్పటికీ కొందరు రైతులు కోలుకోలేదు.

విస్తారంగా మొక్కజొన్న సాగు
దోర్నాల ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్న

పెద్ద దోర్నాల,డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలో రబీ సీజనులో మొక్కజొన్నపైరున రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా మిర్చి,పత్తి సాగు చేసేవారు అయితే ఈ ఏడాది మొంఽథా తుఫాన్‌ కారణంగాకురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన వరద ప్రవాహం పంటలను ముంచెత్తింది. దీంతో తీవ్రంగా నష్ట పోయిన రైతులకు దిక్కుతోచలేదు.ఇప్పటికీ కొందరు రైతులు కోలుకోలేదు. పాడైన పంటలను తొలగించి ఆ స్థానంలో మళ్లీ ఏపైర్లు సాగు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మొక్కజొన్న విత్తన కంపెనీ ఏజన్సీల వారు గ్రామాలకు వచ్చారు. ఎకరాకు పది వేలు రూపాయలు ఆర్థిక సహాయం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తామని, టన్ను రూ.35,000ల వరకు తామే కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎంత లేదన్నా ఎకరంపై 3 టన్నుల దిగుబడి వస్తుందని ఏజన్సీలు తెలిపాయి. కొంత దిగుబడులు తగ్గినా, ఖర్చులన్నీ పోనూ ఎకరాకు యాభై నుంచి అరవై వేలు నికరాదాయం లభిస్తుందని భావిస్త్తున్నారు. దీంతో ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఊరటగా అనిపించింది. పైగా మూడు నెలల కాల పరిమితి కావడం, పెద్దగా కూలీలతో పని లేక పోవడం, సేద్యం ఖర్చు కూడా తక్కువగా ఉండటం కలిసి వ చ్చింది. దీంతో పోలోమని ఎకరాలకు ఎకరాలు విత్తన మొక్కజొన్న సాగుకు ఉపక్రమించారు. మండలంలోని నల్లగుంట్ల,చిలకచెర్ల, ఎగువ చెర్లోపల్లి,కొత్తూరు, గంటవానిపల్లె, యడవల్లి, తిమ్మాపురం, కడపరాజుపల్లె, తదితర గ్రామాల్లో అధిక సంఖ్యలో విత్తారు.మండలంలో సుమారు వెయ్యిఎకరాలకు పైగా సాగు చేసినట్లు రైతులు చెబుతున్నారు.

కంపెనీల నుంచి ఒప్పందం పత్రాలు తీసుకోవాలి

- ఏవో జవహర్‌ లాల్‌ నాయక్‌

మండలంలో విత్తన మొక్కజొన్న సాగు రైతులకు శ్రమ, ఖర్చు విధానంలో మంచిదేనని అయితే సంబంధిత ఏజన్సీల నుంచి ఒప్పందం పత్రాలను రైతులు విధిగా తీసుకోవాలని వ్యవసాయాధికారి జవహర్‌ లాల్‌ నాయక్‌ సూచిస్తున్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:42 PM