జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:38 AM
జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిం చారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశా లతో పెట్రోలు బంకులు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, గ్యాస్ కంపెనీలు, రేషన్ షాపులు, సినిమా థియేటర్లు తదితర చోట్ల సోదాలు చేశారు.
ఒంగోలులో జేసీ గోపాలకృష్ణ, దర్శి ప్రాంతంలో డీఎస్‌వో పరిశీలన
ఇతరచోట్ల రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు
146 ప్రాంతాల్లో సోదాలు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిం చారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశా లతో పెట్రోలు బంకులు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, గ్యాస్ కంపెనీలు, రేషన్ షాపులు, సినిమా థియేటర్లు తదితర చోట్ల సోదాలు చేశారు. జేసీ గోపాలకృష్ణ ఒంగోలు ఆర్టీసీ బస్టాండులోని షాపు లను సందర్శించి అక్కడ తినుబండా రులను పరిశీలించారు. నగరంలోని గ్యాస్ కంపెనీలతోపాటు పెట్రోలు బంకులు, ఆయిల్ మిల్లులు, ఆర్వో ప్లాంట్లను ఆయన సందర్శించారు. అక్కడ అన్నీ ప్రభుత్వ నిబంధ నల ప్రకారం ఉన్నాయా? లేవా? అని పరిశీలిం చారు. ధరల పట్టికలపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట రెవెన్యూ, సివిల్ సప్లయీస్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్‌సెఫ్టీ అధికారులు ఉన్నారు. డీఎస్‌వో పద్మశ్రీ, దొనకొండలో ఎంఎల్‌ఎస్ పాయింట్‌తోపాటు దర్శిలో పెట్రోలు బంకు, చీమకుర్తిలో రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. నెలవారీ చేస్తున్న ప్రక్రియలో భాగంగా ఆయా శాఖల అధికారులు చేసిన తనిఖీల నివేదికలను జాయింట్ కలెక్టర్‌కు పంపనున్నారు. కాగా జిల్లాలో పెట్రోలు బంకులు 38, గ్యాస్ ఏజెన్సీలు 9, రేషన్ షాపులు 50, ఎంఎల్‌ఎస్ పాయింట్లు 9, రైస్ మిల్లులు ఆరు, బాణసంచా గోడౌన్లు 3, ఆర్వో ప్లాంట్లు 22, ఆర్టీసీ బస్టాండ్లు రెండు, హోటల్స్ రెండు, ఐస్‌క్రీం పార్లర్ ఒకటి, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ యూనిట్ ఒకటి, ఐదు థియేటర్లను పరిశీలించారు.