Share News

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:10 PM

క్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదో రోజైన మంగళవారం ఆలయ సమీపంలో గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యాదవ్‌ యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
బండను లాగుతున్న ఎడ్ల జత

మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న వేటపాలెం ఎడ్లజత

సింగరాయకొండ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదో రోజైన మంగళవారం ఆలయ సమీపంలో గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యాదవ్‌ యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.

పలు జిల్లాల నుంచి ఐదు జతల ఎడ్లు పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోటి శిరీషాచౌదరి, శివకృష్ణచౌదరి ఎడ్ల జత నిర్ణీత 20 నిమిషాల్లో 3300 అడుగుల దూరంలాగి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. నంద్యాల జిల్లా గోసపాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన గొటికె హెత్విక్‌రెడ్డి, దినే్‌షరెడ్డి ఎడ్లజత నిర్ణీత సమయంలో 3,168 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాలవారిపాలేనికి చెందిన ఎడ్లజత నిర్ణీత సమయంలో 3,144 అడుగుల దూరంలాగి తృతీయ స్థానం దక్కించుకుంది. బల్లికురవ గ్రామానికి చెందిర పావులూరి వీరిస్వామిచౌదరికి చెందిన పీవీఎ్‌సఆర్‌ బుల్స్‌. 3100 దూరం లాగి చతుర్థస్థానాన్ని, ప్రకాశం జిల్లా అగ్రహారం గ్రామానికి చెందిన లక్కు శివశంకర్‌ ఎడ్లజత నిర్ణీత 20 నిమిషాల్లో 2700 అడుగుల దూరంను లాగి ఐదో స్థానంలో నిలిచాయి. విజేతలైన ఎడ్లజత యజమానులకు వరుసగా బహుమతులను టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య రూ.70వేలు, గంజిప్రసాద్‌ రూ. 50వేలు, బాపట్ల బ్రదర్స్‌ రూ. 40వేలు, చిమట మాధవ రూ.20వేలు అందజేశారు. నేడు రాష్ట్ర స్థాయి రాదాడి పోటీలను నిర్వహించనున్నారు.

Updated Date - Jun 10 , 2025 | 11:10 PM