Share News

పొదిలి ఎక్సైజ్‌ ఎస్‌ఐ సైమన్‌పై వేటు..

ABN , Publish Date - Jul 03 , 2025 | 10:52 PM

ఎక్సైజ్‌శాఖలో పొదిలి ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎ.సైమన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.

పొదిలి ఎక్సైజ్‌ ఎస్‌ఐ సైమన్‌పై వేటు..

ఒంగోలు క్రైమ్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌శాఖలో పొదిలి ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎ.సైమన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. గత నెల 29న పొదిలి ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో బెల్ట్‌షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం డబ్బులు తీసుకుని వదిలేసినట్లు ఎస్‌ఐ సైమన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా ఉన్న మహిళా సీఐ విచారణ చేయగా, ఎస్‌ఐ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోపాటు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అభ్యంతరకర వాఖ్యలు కూడా చేశారు. దీంతో సీఐ జిల్లా ఎక్సైజ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో బుధవారం ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రామ్‌దేవ్‌శర్మలు ఒంగోలు విచ్చేశారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు, పొదిలి విషయంలో నివేదిక సమర్పించి అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని వారు ఆదేశాలు ఇవ్వడంతో ఎస్సై సైమన్‌ను సస్పెండ్‌ చేస్తూ గురువారం డిప్యూటీ కమిషనర్‌ కె.శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jul 04 , 2025 | 08:19 AM