అంతా అక్రమం
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:13 AM
ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న ‘ది గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారులు, క్యూరర్ల సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ (కోల్ సొసైటీ)’పై హైకోర్టులో పిటి షన్ దాఖలైంది. సంఘ పాలకవర్గ ఎన్నిక, నిర్వహణ, భవన నిర్మాణాలు, అందుకు బ్యాంకు రుణాలు పొందడంలో అన్నీ అక్రమాలు చోటుచేసుకున్నాయని పిటిషన్‌దారులు పేర్కొన్నారు.
కోల్ సొసైటీపై హైకోర్టులో పిటిషన్
విచారణకు స్వీకరణ
సమగ్ర విచారణకు ఆదేశించాలని పిటిషన్‌దారుల వినతి
నేడు సింగిల్ జడ్జి ముందుకు..
ఒంగోలు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న ‘ది గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారులు, క్యూరర్ల సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ (కోల్ సొసైటీ)’పై హైకోర్టులో పిటి షన్ దాఖలైంది. సంఘ పాలకవర్గ ఎన్నిక, నిర్వహణ, భవన నిర్మాణాలు, అందుకు బ్యాంకు రుణాలు పొందడంలో అన్నీ అక్రమాలు చోటుచేసుకున్నాయని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాల్సిన సహకారశాఖ అధికారులు వారికే సంపూర్ణంగా సహకరించారని ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర పరిశీలన చేసి బాధ్యులపై చర్యలకు ఆదేశించా లని నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడుకు చెందిన షేక్ ఖాజావలి, తాళ్లూరి కృష్ణారావు హైకో ర్టును కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై జస్టిస్ బీఎస్.భానుమతి సోమవారం విచారించనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, సహకారశాఖ కమిషనర్, కలెక్టర్, సహకారశాఖ అధికారి, జిల్లా సహకార ఆడిట్ అధికారి, డివిజనల్ సహకారాధికారి, ప్రస్తుతం కోల్‌సొసైటీ పాలక మండలితోపాటు గతంలో ఇక్కడ సహకారశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం కావలి డివిజనల్ సహకార అధికారిగా పనిచేస్తున్న పోలిశెట్టి రాజశేఖర్‌ని వ్యక్తిగతంగా కూడా ప్రతివాదులుగా చేర్చారు. సమగ్ర పరిశీలన చేసి బాధ్యులపై చర్యలకు ఆదేశించాలని నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడుకు చెందిన షేక్ ఖాజావలి, తాళ్లూరి కృష్ణారావు హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై జస్టిస్ బీఎస్.భానుమతి సోమవారం విచారించనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, సహకారశాఖ కమిషనర్, కలెక్టర్, సహకారశాఖ అధికారి, జిల్లా సహకార ఆడిట్ అధికారి, డివిజనల్ సహకారాధికారి, ప్రస్తుతం కోల్‌సొసైటీ పాలక మండలితోపాటు గతంలో ఇక్కడ సహకారశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం కావలి డివిజనల్ సహకార అధికారిగా పనిచేస్తున్న పోలిశెట్టి రాజశేఖర్‌ని వ్యక్తిగతంగా కూడా ప్రతివాదులుగా చేర్చారు.
సహకరించిన సహకార అధికారులు
కోల్‌సొసైటీ పొగాకు ఉత్పత్తిదారుల వ్యవసాయ, మార్కెటింగ్ అవసరాలు తీర్చడం ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటైందని పిటిషన్‌దారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సహకార చట్టం ప్రకారం పాలకవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ జారీ, సహకారశాఖ ద్వారా ఎన్నికల అధికారి నియామకం, సభ్యులందరికి తెలియజేయడంతోపాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే అందుకు విరుద్ధంగా అక్రమంగా 2018 డిసెంబరు 12న కమిటీ ఎన్నిక జరిగిందని పేర్కొన్నారు. ఆ సమయంలో బాధ్యత కలిగిన సహకారశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోని కారణంగా ఐదేళ్ల తర్వాత తిరిగి 2023 డిసెంబరులో మరోసారి అలాగే అక్రమంగా ఎన్నికల నిర్వహించుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సంస్థ ప్రాంగణంలో కమర్షియల్ కాంప్లెక్స్
జిల్లా సహకార అధికారి నుంచి ముందస్తు అనుమతి లేకుండా అక్రమంగా ఎన్నికైన పాలకమండలి 2020లో సంస్థ ప్రాంగణంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టిందన్నారు. ఇందుకోసం బ్యాంకుల్లో ఉన్న రూ.2.15కోట్ల సొసైటీ డిపాజిట్లను ముందుగానే ఉపసంహరించుకొని వాడటంతోపాటు బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తెచ్చారన్నారు. ఈ వ్యవహారం అప్పుడు చైర్మన్‌గా నియమితులైన తాటిపర్తి సుబ్బారెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం సాగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. భవన నిర్మాణాలు, రుణాలు తీసుకోవడం, డిపాజిట్ల ఉపసంహరణ, సహకార చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టుకు వారు వివరించారు. ఈ సంస్థ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, అలా ఎన్నికైన పాలకవర్గం సాగించిన కార్యకలాపాలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని ఆడిట్ చేసిన అధికారులు, ఇన్‌స్పెక్టర్లు తమ నివేదికల్లో పేర్కొన్నా నాటి బాధ్యతగల సహకారశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా పాలకవర్గానికి సహకరించారని ఆరోపించారు. ఆ సమయంలో పోలిశెట్టి రాజశేఖర్ (ప్రస్తుతం కావలి డీసీఎల్‌వోగా పనిచేస్తున్నారు) ఒంగోలులో జిల్లా సహకార ఆడిట్ అధికారిగా.. అదేసమయంలో జిల్లా సహకార అధికారిగా, ఒంగోలు డివిజనల్ సహకారాధికారి ఇన్‌చార్జిగా మొత్తం మూడు బాధ్యతల్లో ఉన్నారని ఆయన కూడా ఈ అక్రమ వ్యవహారాలకు బాధ్యుడని పిటిషన్‌దారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం వ్యవహారాన్ని విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు, ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించగా సోమవారం జస్టిస్ బీఎస్ భానుమతి బెంచ్‌పై విచారణ జరగనుంది.