క్షయ నిరోధానికి అందరూ కృషి చేయాలి
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:20 AM
క్షయ వ్యాధిని నిరోధించటానికి కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నదని జిల్లా టీబీ యూనిట్ అధికారి డాక్టర్ శ్రీవాణి పేర్కొన్నారు.
జిల్లా టీబీ యూనిట్ అధికారి శ్రీవాణి
మద్దిపాడు, జూన్ 27(ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధిని నిరోధించటానికి కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నదని జిల్లా టీబీ యూనిట్ అధికారి డాక్టర్ శ్రీవాణి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో ని ఘడియపూడి, గార్లపాడు గ్రామాల్లో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 సం వత్సరాలు దాటిన వ్యక్తులకు దుర్వసనాలు, పౌష్టికాహార లోపం వల్ల టీబీ వస్తుందన్నారు. వారం రోజులపాటు దగ్గుతో బాధపడే వారిని గుర్తించి వారికి కళ్లె పరీక్షలు చేయించాలని సి బ్బందికి సూచించారు. మొబైల్ ఎక్స్‌రే యూని ట్‌ను గ్రామానికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఆనంద్‌మోహన్ మా ట్లాడుతూ ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరిగి టీబీ నమూనాలు తీసుకుంటారని, ప్రజలు సహక రించాలని కోరారు. కార్యక్రమంలో సూపర్‌వైజ ర్ చంద్రమౌళి, డాక్టర్ అన్వేష్, లలితమ్మ, రజి తకుమారి, బాలకోటయ్య, నాగరాజు, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.