పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:40 AM
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చెప్పారు.
ఎమ్మెల్యే దామచర్ల
ఒంగోలు, కార్పొరేషన్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చెప్పారు. ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం 4, 17, 24, 25, 26, 27, 28, 37, 38, 43 డివిజన్లలోని కుటుంబ సాధికార సభ్యులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ డివిజన్లలో సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు సమస్య లేకుండా చూడాలని చెప్పారు. డివిజన్‌లో సమస్యల పరిష్కారం కోసం అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. టీడీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని అందరికీ వివరించాలని చెప్పారు. అలాగే ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువచేయాలన్నారు. డివిజన్లలో ఐక్యతతో సమష్టిగా కలిసి పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు.
సీఎంఆర్‌ఎ్‌ఫతో పేదల ఆరోగ్యానికి భరోసా
ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదల ఆరోగ్యానికి భరోసా లభిస్తోందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చెప్పారు. మంగళవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో 22 మందికి రూ.20.80 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమానికి, పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తుండగా, ప్రైవేటు ఆసుపత్రులలో చేయించుకునే కీలకమైన శస్త్ర చికిత్సలకు బాధితులకు ప్రభుత్వం తరఫున సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించి, అండగా నిలుస్తోందని చెప్పారు.