అందరూ ఐక్యతతో సహాయం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:19 PM
యోగి వేమన రెడ్ల సంక్షేమ సంఘం వారు ఐక్యతగా ఉండి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు.
కంభం, నవంబరు 16 (ఆంఽధ్రజ్యోతి) : యోగి వేమన రెడ్ల సంక్షేమ సంఘం వారు ఐక్యతగా ఉండి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో కంభం, అర్ధవీడు మండలాల యోగి వేమన రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజనం మహోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అశోక్‌రెడ్డి పాల్గొని సంఘ ప్రాముఖ్యతను వివరించారు. సంఘం అధ్యక్షుడు, నాయకులను అభినందించారు. అనంతరం సంఘం వారు ఎమ్మెల్యేని సత్కరించారు. కార్యక్రమంలో కంభం, అర్ధవీడు మండలాల రెడ్ల సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.