క్షయ నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:19 AM
జిల్లాలో 60 ఏళ్ళకు పైబడిన వారందరూ క్షయ నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకోవా లని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపుని చ్చారు.
ఎమ్మెల్యే దామచర్ల పిలుపు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 60 ఏళ్ళకు పైబడిన వారందరూ క్షయ నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకోవా లని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపుని చ్చారు. టీబీ ముక్తభారత్ అభియాన్‌లో భా గంగా మంగళవారం స్థానిక 49వ డివిజన్‌లో జరిగిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్యఅ తిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే దామచర్ల మాట్లాడుతూ 60 ఏళ్ళుపై బడి న ప్రజలు, షుగర్ ఉన్నవారు, పొగ, మద్యం తాగే వారు ఎక్కువగా క్షయ బారిన పడతార ని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం ఉచితంగా క్షయ నిర్ధారణ పరీక్షలను చేస్తున్నందున ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు మాట్లా డుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1,12,817 మందికి వైద్యపరీక్షలు చేయగా 5432 మందిని అనుమానితులుగా గుర్తించామని, వారిలో 137 మందికి క్షయ నిర్ధారణ అయిందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు క్షయపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తె లిపారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసి, క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీవాణి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.