Share News

ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు

ABN , Publish Date - Nov 12 , 2025 | 10:24 PM

రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి రానున్న మూడున్నర సం వత్సరంలో ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని రాజానగర్‌, ఎన్టీఆర్‌ కాలనీలో కాకర్ల లక్షీదేవి నిర్మించుకున్న ఎన్టీఆర్‌ గృహాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గృహప్రవేశ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు
గృహాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఎన్టీఆర్‌ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి రానున్న మూడున్నర సం వత్సరంలో ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని రాజానగర్‌, ఎన్టీఆర్‌ కాలనీలో కాకర్ల లక్షీదేవి నిర్మించుకున్న ఎన్టీఆర్‌ గృహాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గృహప్రవేశ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను ప్రభుత్వం అందచేయడం సంతోషకరమన్నారు. నియోజకవర్గంలో 7190 మందికి ఎన్టీఆర్‌ గృహాలు మంజూరయ్యాయని, మున్సిపాలిటీ పరిధిలో 114 మందికి మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మంజూరు పత్రాలు అందచేశారు. గృహా లు మంజూరైన ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. పేదల సొంత ఇంటి కళ నెరవేర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో పేదల ఇంటి కలను నిర్వీర్యం చేశారని, 4.73లక్షల ఇళ్లను రద్దు చేసి పేదలకు అన్యాయం చేశారని తీవ్రంగా విమర్శించారు. 2.73లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకుంటే నాటి వైసీపీ బిల్లులు చెల్లించక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నోట్లో మట్టి కొట్టారని ఆయన ఽధ్వజమెత్తారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరోవైపు అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తుందన్నారు. అర్హులైన పేదలు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్‌ బైలడుగు బాలయ్య, వైస్‌చైర్మన్‌ గోడి ఓబులరెడ్డి, మున్సిపల్‌ కమీషనర్‌ ఇ.వి.రమణబాబు, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్తా బాలీశ్వరయ్య, హౌసింగ్‌ డీఈ ఖదీర్‌బాషా, పట్టణ పార్టీ అధ్యక్షుడు షానేషావలి, కౌన్సిలర్‌ బూనబోయిన చంద్రశేఖర్‌, లొక్కు రమేష్‌, టీడీపీ నాయకులు దప్పిలి కాశిరెడ్డి, బిల్లా రమేష్‌ పాల్గొన్నారు.

20న జాబ్‌ మేళా

ఎర్రగొండపాలెం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాబివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాల యం, సీడాప్‌ సంయుక్తంగా ఈనెల 20 వతేదిన జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌నాయుడు బుధవారం తెలిపారు. ఈ జాబ్‌ మే ళాలో 9 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. 19 నుంచి 30 సంవత్సరాలలోపు వయస్సు, 10వతరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా పూర్తయిన యువతీయువకులు అర్హులని తెలిపారు. ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులు ఆధార్‌, పాన్‌కార్డు, సర్టిఫికెట్లతో హాజరు కావాలని, వివరాలకు స్కిల్‌ హబ్‌ కోఆర్డినేటర్‌ విజయకుమారి 9553945387, 8187084281కి సంప్రదించాలని కోరారు.

Updated Date - Nov 12 , 2025 | 10:24 PM